విధాత : దేశంలో ఓ ఐఏఎస్ అధికారి ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుని సంచలనంగా మారాడు. అంతేకాదు.. ఆ ముగ్గురు భార్యలు కూడా ఐఏఎస్ అధికారులే కావడం మరో విశేషం. మధ్యప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అవీ ప్రసాద్ తన మూడో పెళ్లితో తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు.
తొలుత ఐఏఎస్ అధికారిణి రిజు బాఫ్నాను పెళ్లి చేసుకున్నారు. ఆమెతో విడిపోయిన తర్వాత మరో ఐఏఎస్ అధికారిణి మిశా సింగ్‌ను వివాహమాడారు. నాలుగేళ్లయ్యాక ఆమెతో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కూడా ఐఏఎస్ అధికారిణినే మనువాడారు. ఈ నెల 11న 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి అంకితా ధాక్రేను మూడో వివాహం చేసుకున్నారు.
రాజకీయ నేపథ్యమున్న కుటుంబానికి చెందిన అవీ ప్రసాద్ స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని సీతాపుర్ జిల్లా. ఆయన తాత తంబేశ్వర్ ప్రసాద్ ఎలియాస్ బచ్చా బాబు గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అవీ ప్రసాద్ 2013లో ఐపీఎస్‌కు, మరుసటి ఏడాది ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. మొత్తానికి ఓ ఐఏఎస్ వరుసగా మూడు పెళ్లిళ్లు చేసుకోవడంతో పాటు మూడుసార్లు కూడా ఐఏఎస్ అధికారిణులనే వివాహం చేసుకుని అవి ప్రసాద్ పెళ్లిళ్ల పర్వంలో సరికొత్త రికార్డు సృష్టించనట్లయ్యింది.
