Ishan Kishan’s Girlfriend | వరల్డ్ కప్ హీరో ఇషాన్ కిషన్ ప్రేమకథ ఆఫీషియల్!!

టీ20 వరల్డ్ కప్ హీరో ఇషాన్ కిషన్ గర్ల్‌ఫ్రెండ్ గురించి కిషన్​ తాతయ్య వివరాలు బయటపెట్టారు. ఆమె పేరు అదితి హుండియా. ఎవరీ అదితి హుండియా? ఆమె పూర్తి బయోగ్రఫీ, Miss Diva 2018 విజయాలు, కెరీర్ వివరాలు, పెళ్లి రూమర్లపై లేటెస్ట్​ అప్​డేట్లు..

Ishan Kishan girlfriend Aditi Hundia after grandfather confirms relationship

IT’S OFFICIAL:  Aditi Hundia – Ishan Kishan’s confirmed Girlfriend

🔎 సంక్షిప్తంగా

టీ20 వరల్డ్ కప్‌ హీరో ఇషాన్ కిషన్ ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంతో కూడా వార్తల్లో నిలిచాడు.  జైపూర్‌కు చెందిన “అదితి హుండియా“ను ఇషాన్​ గర్ల్​ఫ్రెండ్​గా తన తాతయ్య అధికారికంగా తెలిపాడు.

 విధాత క్రీడా విభాగం | హైదరాబాద్​:

Ishan Kishan’s Girlfriend | టీ20 వరల్డ్ కప్ వేదికగా పాకిస్థాన్‌పై మెరుపు ఇన్నింగ్స్ ఆడి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న ఇషాన్ కిషన్ ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంతో కూడా వార్తల్లో నిలిచాడు. ఇషాన్ తాతయ్య అనురాగ్ పాండే “అదితి అతని గర్ల్‌ఫ్రెండ్” అని వెల్లడించడంతో ఎన్నాళ్లుగానో వినిపిస్తున్న ప్రచారాలకు అధికార ముద్ర పడింది. దీంతో అభిమానుల్లో పెళ్లి ఊహాగానాలు జోరందుకున్నాయి.

పాకిస్థాన్‌పై ఇషాన్ మెరుపులు – పడిలేచిన తరంగం

కొలంబోలో పాకిస్థాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఇషాన్ 40 బంతుల్లో 77 పరుగులు (10 ఫోర్లు, 3 సిక్సర్లు) బాది భారత్‌కు 175 పరుగుల స్కోరు అందించాడు. చివరకు 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంలో అతని పాత్ర కీలకం. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచిన తొలి వికెట్‌కీపర్‌గా నిలిచిన ఇషాన్, “పని ఇంకా పూర్తికాలేదు” అంటూ తన ఫోకస్ టోర్నమెంట్‌పైనే ఉందని స్పష్టం చేశాడు. ఆడిన 3 ప్రపంచకప్​ మ్యాచుల్లో రెండు అర్థసెంచరీలు చేసిన కిషన్​, సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన దాదాపు రెండేళ్ల తర్వాత ఇలాంటి ప్రదర్శన ఇవ్వడం అతని కెరీర్‌లో పెద్ద మలుపుగా మారింది.

ఇషాన్​ గర్ల్​ఫ్రెండ్​ – ఎవరీ అదితి హుండియా?

అదితి హుండియా(Aditi Hundia) రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌కు చెందిన మోడల్, ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్ మరియు వ్యాపారవేత్త. వ్యాపార కుటుంబానికి చెందిన అదితి చిన్నప్పటి నుంచే ఫ్యాషన్ రంగంపై ఆసక్తి పెంచుకుంది. జైపూర్‌లోనే విద్యాభ్యాసం పూర్తి చేసి మోడలింగ్ వైపు అడుగుపెట్టింది.

2017లో ఫెమినా మిస్ ఇండియా(FEMINA Miss India) పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలిచి గుర్తింపు పొందిన ఆమె, 2018లో మిస్ దివా కిరీటం అందుకోవడంతో జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందింది. అనంతరం ర్యాంప్ షోలు, ఫ్యాషన్ వీక్స్, బ్రాండ్ ఎండోర్స్‌మెంట్లు, ఫోటోషూట్లతో కెరీర్‌ను విస్తరించింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలాది ఫాలోవర్లతో అదితి ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఎదిగింది. ఫ్యాషన్, ట్రావెల్, లైఫ్‌స్టైల్ కంటెంట్‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించింది. జైపూర్‌లో ఫ్యాషన్ ఔట్‌లెట్ నిర్వహిస్తూ వ్యాపార రంగంలోనూ అడుగుపెట్టింది. అదనంగా తన తల్లితో కలిసి “సంగిని” అనే గ్రూప్ ద్వారా అనాథ పిల్లలకు సహాయం చేస్తూ సామాజిక సేవలోనూ పాల్గొంటోంది.

వ్యక్తిగత వివరాలు:

కెరీర్ హైలైట్స్:

ఇన్‌స్టాగ్రామ్‌లో 2.8 లక్షలకు పైగా ఫాలోవర్లు

కిషన్​ కుటుంబం ఓకే – పెళ్లిబాజాలు ఎప్పుడు?

ఇషాన్ తాత అనురాగ్ పాండే మాట్లాడుతూ, “ఇషాన్ ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటే నేను అంగీకరిస్తాను. అదితి మంచి అమ్మాయి” అని వెల్లడించారు. కుటుంబం నుంచి ఈ మద్దతు లభించడంతో పెళ్లి రూమర్లు వేగం పుంజుకున్నాయి. అయితే అధికారికంగా పెళ్లి తేదీపై ఎలాంటి ప్రకటన లేదు.

ఒకవైపు వరల్డ్ కప్‌లో పరుగులతో మెరిసే ఇషాన్… మరోవైపు ఫ్యాషన్, వ్యాపారం, సేవా కార్యక్రమాలతో గుర్తింపు తెచ్చుకున్న అదితి. ఇప్పుడు అభిమానుల ఆసక్తి ఒక్కటే—ముందుగా వరల్డ్ కప్ ట్రోఫీనా? లేక వివాహ శుభలేఖనా?

Latest News