Kannada TV Actress | సినీ చిత్రపరిశ్రమలో మహిళలపై వేధింపుల ఘటనలు ఇటీవలే హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళం, కన్నడ.. ఇలా ఇండస్ట్రీ ఏదైనా తాము వేధింపులకు గురయ్యామంటూ పలువురు తారలు బహిరంగంగానే చెప్తున్నారు. తాజాగా ఓ నటికి చేదు అనుభవం ఎదురైంది. నటి వాష్‌రూమ్ (Toilet)లో ఉండగా ఓ వ్యక్తి సీక్రెట్ కెమెరా ద్వారా ఆమె వీడియోలు రికార్డు (Secret Filming) చేశాడు. ఈ ఘటన కన్నడ చిత్ర పరిశ్రమలో వెలుగు చూసింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. కన్నడ చిత్రపరిశ్రమకు చెందిన ఓ నటి (Kannada TV Actress) ఫిబ్రవరి 6 నుంచి 13వ తేదీ మధ్య బెంగళూరు ఇండోర్ స్టేడియంలో జరిగిన ఓ ఈవెంట్‌కు హాజరయ్యింది. ఆ సమయంలో అక్కడ వాష్‌రూమ్‌ను యూజ్ చేసింది. ఆ సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి సీక్రెట్‌గా ఆమె వీడియోలు చిత్రీకరించాడు. అనంతరం వాటితో బెదిరింపులకు దిగాడు. నిందితుడు తొలుత ఈ వీడియోలను నటి స్నేహితురాలి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు పంపి, అది నటి ఖాతానే అని భావించి బెదిరించాడు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో బహిర్గతం చేస్తానని హెచ్చరించాడు.
దీంతో భయపడిపోయిన నటి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి కొన్ని ఆధారాలను కూడా నటి పోలీసులకు సమర్పించింది. ఆ ఆధారాల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. షూటింగ్ లొకేషన్లలో పనిచేసే ఇతర సిబ్బంది పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు సదరు ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
Emmanuel Macron | ముంబై వాసులను సర్‌ప్రైజ్ చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు..
KTR counter attack| మాది ఫైటర్ల జాతి, మీది ట్రెయిటర్ల (ద్రోహుల) జాతి: సీఎం రేవంత్ కు కేటీఆర్ కౌంటర్
