Dasoju Sravan : ‘మెస్సీ vs మేస్త్రీ’ ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం రూ.100 కోట్లు

'మెస్సీ vs మేస్త్రీ' ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు.

Dasoju sravan

విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ఫ్రాడ్ సిటీ ఫ్యూచర్ సిటీలో బోగస్ గ్లోబల్ సమ్మిట్‌కు రూ.200 కోట్లు ఖర్చు పెట్టాడని, ‘మెస్సీ vs మేస్త్రీ’ ఫుట్‌బాల్ ఒక్క మ్యాచ్ కోసం రూ.100 కోట్లు ఖర్చు పెడుతున్నాడని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. నన్ను కోసుకు తిన్నా డబ్బులు లేవని చెప్పే రేవంత్ రెడ్డికి.. ఈ జల్సాలకు పైసలు ఎక్కడి నుంచి వచ్చాయి? అని..ఇదంతా దుబారా కాదా అని ప్రశ్నించారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. రేవంత్ జల్సా మ్యాచ్ కోసం వంద కోట్ల ఖర్చుతో ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో పిచ్ తవ్వేసి ఫుట్ బాల్ మ్యాచ్ నిర్వహిస్తున్నారన్నారు. 15నిమిషాల ఆట కోసం సింగరేణి గని కార్మికుల చెమట నుంచి వచ్చిన డబ్బును రేవంత్ జల్సా మ్యాచ్ కు మళ్లిస్తున్నారని శ్రవణ్ ఆరోపించారు. మళ్లా ఉప్పల్ స్టేడియంను తిరిగి క్రికెట్ ఆడేందుకు అనుకూలంగా మార్చాలంటూ మరిన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉందన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు డబ్బులు లేవు కానీ రేవంత్ జల్సా మ్యాచ్ లకు డబ్బులు ఉన్నాయా? అని శ్రవణ్ ప్రశ్నించారు. విద్యార్ధుల ఫీజు రీయంబర్స్ మెంట్ కు, స్కాలర్ షిప్ లకు, గురుకులాల పిల్లల వసతులకు, రిటైర్మెంట్ ఉద్యోగుల బకాయిలకు, ఆరోగ్య శ్రీకి, కల్యాణ లక్ష్మికి, మహాలక్ష్మి పథకం అమలుకు డబ్బులు లేవంటున్న రేవంత్ రెడ్డిని ఇన్ని కోట్లు ఎక్కడినుంచి వచ్చాయో ప్రజలకు సమాధానం చెప్పాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అని.. రెండు, మూడో విడత ఎన్నికల్లో ప్రజలు రేవంత్ జల్సాలపై స్పష్టమైన తీర్పు ఇస్తారన్నారు. తెలంగాణలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత స్పష్టమైందన్నారు. అధికార పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వంకు ఉన్న సానుకూలతలు, అధికార దుర్వినియోగం, ప్రలోభాలను అధిగమించి కూడా ఆ పార్టీకి 1500కు పైగా పంచాయతీల్లో విజయం దక్కడం చూస్తే ప్రభుత్వ వ్యతిరేక తీర్పు స్పష్టమవుతుందన్నారు. బీఆర్ఎస్ దక్కిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు పార్టీ ఉజ్వల భవిష్యత్తుకు సంకేతమని..రాష్ట్రంలో మళ్లీ రానున్నది బీఆర్ఎస్ అనే తేలిపోయిందన్నారు.

ఇవి కూడా చదవండి :

Agro Processing Hub | ప్రభుత్వం వ్యవసాయాధారిత పరిశ్రమలపై దృష్టి పెట్టాలి : సీపీఐ నేత లక్ష్మీనారాయణ
Komati Reddy : ఇకపై సినిమా టికెట్ ధరలు పెంచేదే లేదు

Latest News