Dasoju Sravan | చంపుతామంటూ రేవంత్ రెడ్డి అనుచరుల బెదిరింపులు: దాసోజు తీవ్ర ఆరోపణలు

<p>Dasoju Sravan విధాత, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అనుచరులు తనను చంపుతామని బెదిరిస్తున్నారంటు బీఆరెస్ నాయకుడు దాసోజు శ్రవణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉచిత విద్యుత్తుపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై గత 3 రోజులుగా దుమారం నడుస్తుండగా అధికార పార్టీ బీఆరెఎస్ నుంచి దాసోజు శ్రవణ్‌ కూడా రేవంత్ రెడ్డిని విమర్శించారు. ఇది నచ్చని రేవంత్ రెడ్డి అనుచరులు శుక్రవారం అర్థరాత్రి తనకు ఫోన్ చేసి నన్ను చంపుతామని వార్నింగ్ ఇచ్చారని, బండ బూతులు తిట్టారని శ్రవణ్ […]</p>

Dasoju Sravan

విధాత, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అనుచరులు తనను చంపుతామని బెదిరిస్తున్నారంటు బీఆరెస్ నాయకుడు దాసోజు శ్రవణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉచిత విద్యుత్తుపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై గత 3 రోజులుగా దుమారం నడుస్తుండగా అధికార పార్టీ బీఆరెఎస్ నుంచి దాసోజు శ్రవణ్‌ కూడా రేవంత్ రెడ్డిని విమర్శించారు. ఇది నచ్చని రేవంత్ రెడ్డి అనుచరులు శుక్రవారం అర్థరాత్రి తనకు ఫోన్ చేసి నన్ను చంపుతామని వార్నింగ్ ఇచ్చారని, బండ బూతులు తిట్టారని శ్రవణ్ తన ట్విట్టర్‌లో తెలిపారు.

మరోసారి రేవంత్‌పై విమర్శలు చేస్తే చంపుతామన్నారని, తెలంగాణలో రేవంత్ రౌడీ రాజకీయాలు చేస్తున్నారని, రేవంత్ అనుచరుల బెదిరింపులపై సైబర్ క్రైమ్ పోలీసులకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా శ్రవణ్ తెలిపారు.

కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న హనుమంతరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి వంటి సీనియర్లను సైతం రేవంత్ అనుచరులు బెదిరించిన విషయాన్నిశ్రవణ్ గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో రౌడీ రాజకీయాలు, చౌకబారు వ్యూహాలు మంచివి కావని రేవంత్‌కు సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి రౌడీ రాజకీయాన్ని ఎలా ప్రోత్సహిస్తుందని దాసోజు ప్రశ్నించారు.

Latest News