Site icon vidhaatha

BRS Party | గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్ర‌వ‌ణ్‌, కుర్రా స‌త్య‌నారాయ‌ణ‌..!

BRS Party |

గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్ర‌వ‌ణ్‌, కుర్రా స‌త్య‌నారాయ‌ణ పేర్ల‌ను ఖ‌రారు చేసిన‌ట్లు రాష్ట్ర మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వీరిద్ద‌రి పేర్ల‌ను గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్ర‌తిపాదిస్తూ కేబినెట్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు కేటీఆర్ వెల్ల‌డించారు. కేబినెట్ స‌మావేశం ముగిసిన అనంత‌రం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

2024 ఎన్నిక‌ల్లో సంకీర్ణ ప్ర‌భుత్వం వ‌స్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. సంకీర్ణ ప్ర‌భుత్వంలో బీఆర్ఎస్ పాత్ర కీల‌కంగా ఉంటుంది. సంకీర్ణ ప్ర‌భుత్వం ద్వారానైనా సాధించుకుంటామ‌నే న‌మ్మ‌కం ఉంది. గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ‌ను అడ్డుపెట్టుకుని కేంద్రం రాజ‌కీయాలు చేస్తుంది.

చ‌ట్ట‌స‌భ‌ల గౌర‌వం త‌గ్గించి ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేస్తున్నారు. శాస‌న‌స‌భ ఆమోదించిన బిల్లుల‌ను వెన‌క్కి పంపించారు. గ‌వ‌ర్న‌ర్ వెన‌క్కి పంపిన 3 బిల్లుల‌ను మ‌రోసారి అసెంబ్లీలో ఆమోదిస్తాం. రెండోసారి ఆమోదించిన బిల్లుల‌ను గ‌వ‌ర్న‌ర్ ఆమోదించ‌క త‌ప్ప‌దు అని కేటీఆర్ తెలిపారు.

Exit mobile version