విధాత :భారత్ చైనా సరిహద్దులో గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన సూర్యాపేట వాసి కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు మాతృమూర్తి బిక్కుమళ్ల మంజుల ఉపేందర్ సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగింది. ఆమె 44వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం విశేషం. మంజుల ఉపేందర్ నామినేషన్ కార్యక్రమానికి జనం భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ రక్షణ కోసం తన కుమారుడు ప్రాణ త్యాగం చేశాడని, తాను స్థానిక ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. దేశ ప్రజల కోసం తన కొడుకు చేసిన నిస్వార్థ సేవ, త్యాగాన్ని తాను కూడా ప్రజాసేవలో కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
కల్నల్ సంతోష్ బాబు భారత్-చైనా సరిహద్దుల్లో 2020 జూన్ లో జరిగిన సైనిక ఘర్షణలో అమరుడయ్యాడు. దేశ రక్షణలో ప్రాణ త్యాగం చేసిన సంతోష్ బాబు సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2021లో దేశంలోనే రెండో అత్యున్నత సైనిక పురస్కారమైన మహావీర్ చక్ర’ పురస్కారం అందించి గౌరవించింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సంతోష్ బాబు భార్య సంతోషికి గ్రూప్ 1 ఉద్యోగం డిప్యూటీ కలెక్టర్ పోస్టింగ్ ఇవ్వడం గమనార్హం.
ఇవి కూడా చదవండి :
Silver Gold Price Today : వేలల్లో తగ్గిన బంగారం, వెండి ధరలు
Nirmala Sitharaman : నిర్మలమ్మ బడ్జెట్ టీమ్ ఇదే.. తొలిసారి శక్తిమంతమైన మహిళకు చోటు.. ఫుల్ డీటెయిల్స్ ఇవే..!
