Overseas Jobs | కారు మెకానిక్ పని వచ్చిన వారికి గుడ్‌న్యూస్! ఆస్ట్రేలియాలోని ఆటో మొబైల్ రంగంలో భారీ జీతంతో ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. కార్ మెకానిక్‌తో పాటు స్ప్రే పెయింటర్, ప్యానెల్ బీటర్ల జాబ్‌ల నియమకానికి ప్రభుత్వ సంస్థ టామ్‌కమ్ ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.3.6 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు జీతం ఇస్తారని తెలిపింది.
అర్హతలు
ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి.
* పదో తరగతి/ఇంటర్/ఐటీఐ/ ట్రేడ్ సర్టిఫికెట్/డిప్లొమా (ఆటోమొబైల్/మెకానికల్ ట్రేడ్)
* ఇంగ్లీష్ భాషలో నైపుణ్యం
* వయసు 45 సంవత్సరాల లోపు ఉండాలి
* లగ్జరీ లేదా ప్రీమియం కార్ బ్రాండ్స్‌లో కనీసం 7 సంవత్సరాల అనుభవం ఉండాలి
* ఇంగ్లీష్ భాషకు సంబంధించి IELTS స్కోర్ 5 తప్పనిసరి
దరఖాస్తు విధానం
అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు తమ రెస్యూమ్‌ను tomcom.resume@gmail.com అడ్రస్‌కు మెయిల్ చేయాలని టామ్‌కమ్ సంస్థ తెలిపింది. మరిన్ని వివరాలకు 94400 51285, 94400 51452 నంబర్లలో సంప్రదించాలని సూచించింది.
Read More :
వెల్డింగ్ పని తెలిస్తే నెలకు రూ.4లక్షలు.. ఆస్ట్రేలియాలో ఉద్యోగవకాశం!
