Overseas Jobs | వెల్డింగ్ పని తెలిస్తే నెలకు రూ.4లక్షలు.. ఆస్ట్రేలియాలో ఉద్యోగవకాశం!

Overseas Jobs | వెల్డింగ్ రంగంలో అనుభవం ఉన్న వారికి ఆస్ట్రేలియాలో మంచి ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. నెలకు సుమారు 4 లక్షల జీతంతో ఈ ఉద్యోగాలకు ప్రకటన విడుదలైందని ప్రభుత్వ సంస్థ టామ్‌కమ్ వెల్లడించింది.

Reported by: Chandram | విద్య - ఉద్యోగం | Mar 16, 2026, 7:28 pm IST
Read Time: 4 mins
Overseas Jobs | వెల్డింగ్ పని తెలిస్తే నెలకు రూ.4లక్షలు.. ఆస్ట్రేలియాలో ఉద్యోగవకాశం!

Overseas Jobs | వెల్డింగ్ పని తెలిసిన వారికి విదేశాల్లో భారీ ఉద్యోగవకాశాలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ టామ్‌కమ్ (TOMCOM) ద్వారా ఆస్ట్రేలియా (Australia)లో వెల్డర్ల నియమకానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.3.6 లక్షల నుంచి రూ.4 లక్షల జీతం ఉంటుందని ఆ నోటిఫికేషన్‌లో టామ్‌కమ్ వెల్లడించింది.

ఆస్ట్రేలియాలో నిర్మాణ, మైనింగ్, మెటల్ ఫ్యాబ్రికేషన్ పరిశ్రమల్లో నైపుణ్యం కలిగిన వెల్డర్లకు భారీ ఉద్యోగ అవకాశాలు ఉండటంతో వాటి కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నియామకాలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) నిర్వహించనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టామ్‌కమ్ సూచించింది.

అర్హతలు

ఈ ఉద్యోగాలకు పదో తరగతి, ఇంటర్, ఐటీఐ లేదా వెల్డింగ్/ఫ్యాబ్రికేషన్/మెకానికల్ విభాగాల్లో డిప్లొమో చేసిన వారు అర్హులు. వెల్డింగ్‌ పనిలో ఐదు నుంచి ఏడేళ్ల అనుభవం కలిగి ఉండాలి. MIG/TIG/ARC/Stick వెల్డింగ్‌లో నైపుణ్యం ఉండాలి. అలాగే టెక్నికల్ డ్రాయింగ్స్ చదవగలగడం, మెటల్ కట్టింగ్, గ్రైండింగ్, మెటల్ ఫ్యాబ్రికేషన్‌లో స్కిల్స్ తెలిసి ఉండాలి. క్వాలిటీ ఇన్‌స్పెక్షన్, సేఫ్టీ నిబంధనలు పాటించగలగాలి.

దరఖాస్తు విధానం

అలాగే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలగాలి. IELTS పరీక్షలో కనీసం 5 స్కోర్ చేయాలి. ఇక ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 25 నుంచి 40 సంవత్సరాలలోపు ఉండాలని టామ్‌కమ్ కంపెనీ తెలిపింది.

అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు తమ రెస్యూమ్‌ను tomcom.resume@gmail.com అడ్రస్‌కు మెయిల్ చేయాలని టామ్‌కమ్ సంస్థ తెలిపింది. మరిన్ని వివరాలకు 94400 51285, 94400 51452 నంబర్లలో సంప్రదించాలని సూచించింది.

Read More :

Tadoba Tiger : పెద్దపులితో ఇలాగేనా?…దాడి చేస్తే అంతే !

కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ మీటింగ్ అలజడి !