నేను పార్టీ మారడానికి సంజయ్‌నే కారణం: మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి

నేను పార్టీ మారాలని ఆలోచిస్తున్నానంటే దానికి కారణం ఎమ్మెల్యే సంజయ్. కాంగ్రెస్‌తో తన 40 ఏళ్ల బంధంపై జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Jeevan Reddy

విధాత, హైదరాబాద్ : నేను పార్టీ మారాలని ఆలోచించేందుకు కారణం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి టి. జీవన్‌రెడ్డి తేల్చి చెప్పారు. ప్రస్తుతానికి ఇంకా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్లు స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ పార్టీతో తనది 40 ఏళ్ల బంధమని గుర్తు చేశారు. అంత సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకుని పార్టీ మార్పుపై ఆలోచిస్తున్నానంటే ఎంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నానో అర్దం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌.. జిల్లా ప్రజల అభివృద్ధి హక్కును సాధించలేకపోతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ను వీడితే.. నా ఫ్లెక్సీలతో సహా అన్ని మారిపోవడం సహజమే అన్నారు. 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల‌ను పార్టీలో జోక్యం చేసుకోకుండా బ‌య‌ట‌కు పంపితే.. నేను ఎందుకు కాంగ్రెస్ పార్టీని వీడుతానని ప్రశ్నించారు. ఉగాది తర్వాత పార్టీ మార్పు నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు.

తనతో కలిసి పనిచేయాలంటూ సంజయ్ నాకు ఆఫర్ ఇవ్వడం ఏంటని జీవన్ రెడ్డి తప్పుబట్టారు. అసలు సంజయ్ ఏ పార్టీలో ఉన్నారో ముందు ఆయన స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ ఏమో ఆయన బీఆర్ఎస్‌లో ఉన్నారని అంటున్నారని, సంజయ్ ఏమో కాంగ్రెస్‌లో కలిసి పనిచేద్దాం అంటున్నారని, అసలు నాకు ఆఫర్ ఇవ్వడానికి అసలు సంజయ్ ఎవరని ప్రశ్నించారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి, మరో పార్టీలో ఉంటూ సీనియర్ నేతలకు ఆఫర్లు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. వక్రమార్గాన వెళ్తే ప్రజలు ఎన్నటికీ హర్షించరని హితవు పలికారు.

ఇవి కూడా చదవండి :

Srinagar Tulip Garden : శ్రీనగర్‌ తులిప్‌ గార్డెన్ ప్రారంభం..సందర్శకుల వెల్లువ
అసెంబ్లీలో కేటీఆర్ వర్సెస్ మంత్రులు

Latest News