OnePlus Nord 6 | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ నుంచి కొత్త మొబైల్ వస్తోంది. మిడ్ రేంజ్ మోడల్ అయిన Nord 6ను త్వరలోనే భారత్‌లో లాంచ్ చేయబోతుంది. గత మోడల్స్‌తో పోలిస్తే భారీ అప్‌గ్రేడ్ చేసింది. snapdragon 8s gen 4 చిప్‌సెట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ వస్తుండటంతో దీని పర్‌ఫార్మెన్స్ గణనీయంగా పెరగొచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు. అయితే ధర మాత్రం గత Nord 5తో పోలిస్తే చాలా ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ధర ఎంత వరకు పెరుగుతుంది.
గత ఏడాది వచ్చిన OnePlus Nord 5 ధర రూ31,999 నుంచి ప్రారంభమైంది. అయితే కొత్తగా రానున్న Nord 6 ధర ముందు మోడల్‌తో పోలిస్తే రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు పెరిగే అవకాశం ఉంది. అంటే బేస్ వేరియంట్ ధర రూ.35 వేలకు పైగానే ఉండొచ్చని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
స్పెసిఫికేషన్స్
లీకైన సమాచారం ప్రకారం వన్‌ప్లస్ నార్డ్ 6 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో మార్కెట్‌లోకి వస్తుంది. 8జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ వేరియంట్లతో వస్తుంది. ఈసారి 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ లేకపోవడం డిసప్పాయింట్ అనే చెప్పొచ్చు.
గీక్ బెంచ్ లిస్టింగ్ ప్రకారం.. నార్డ్ సిరీస్‌లో వస్తున్న ఈ మొబైల్‌లో భారీ అప్‌గ్రేడ్ వస్తుంది. ఇందులో snapdragon 8s gen 4 చిప్‌సెట్ వస్తుందని సమాచారం. అలాగే ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఓఎస్‌తో పనిచేస్తుంది. ఇక గీక్‌బెంచ్ నిర్వహించిన పరీక్షల్లో సింగిల్ కోర్ 2040, మల్టీ కోర్ 6520 పాయింట్లు సాధించింది. మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో ఇది స్ట్రాంగ్ పర్మార్మెన్స్ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇది Adreno 825 జీపీయూతో పాటు ఏఐ ఫీచర్లతో వస్తుంది.
ఇతర స్పెసిఫికేషన్లు
* 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే
* 165 Hz రీఫ్రెష్ రేట్(హైస్మూత్‌నెస్)
* 1800 నిట్స్ బ్రైట్‌నెస్
* 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా
* 2 మెగాపిక్సెల్ మోనో క్రోమ్
* 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
ఈసారి వన్‌ప్లస్ Nord CE వేరియంట్ రాకపోవచ్చని సమాచారం. కేవలం Nord 6 మాత్రమే లాంచ్ అవ్వనుందని లీకులను బట్టి తెలుస్తోంది. కొత్త స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, మెరుగైన డిస్‌ప్లే కారణంగా ఈ మోడల్ పర్మార్మెన్స్ గణనీయంగా పెరగడం మంచి విషయమే అయినప్పటికీ.. ధర కూడా అదే స్థాయిలో పెరగడంతో యూజర్లను మరి ఆ రేంజ్‌లో సంతృప్తి పరుస్తుందో లేదో చూడాలి.
Read More:
15వేల లోపే బెస్ట్ స్మార్ట్‌ఫోన్.. భారీ బ్యాటరీ, ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ !
