ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో విచారణ ముగించిన సుప్రీంకోర్టు

బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ ముగిసింది. స్పీకర్ ఇప్పటికే తీర్పు ఇచ్చినట్లు కోర్టుకు తెలిపారు. తీర్పు కాపీలు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.

MLA Defection Case

విధాత : బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు 10మందిపై దాఖలైన అనర్హత పిటిషన్ల విచారణ ముగిసినట్లుగా సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది. బీఆర్ఎస్ వేసిన పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీర్పు ప్రకటించినట్లుగా స్పీకర్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోర్టుకు తెలిపారు. సింఘ్వీ వాదనలతో ఏకీభవించిన జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మసిహా ధర్మాసనం..ఈ కేసులో విచారణ ముగిసినట్లుగా తెలిపింది. అయితే స్పీకర్ తీర్పు కాపీలు మాకు ఇంకా అందలేవన్న బీఆర్ఎస్ తరుపు లాయర్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. రెండు రోజుల్లో తీర్పు కాపీలు పిటిషనర్లకు ఇవ్వాలని, ఈ కేసు యొక్క ఆధారాలు, పిటిషనర్ అడిగే వివరాలు 4 రోజుల్లో అందచేయాలని ధర్మాసనం స్పీకర్ గడ్డం ప్రసాద్ ను ఆదేశించింది.

బీఆర్ఎస్ 10మంది ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించి ధాఖలైన అనర్హత పిటిషన్లను మార్చి 12వ తేదీలోగా చెల్లించాని గత విచారణ సందర్బంగా సుప్రీంకోర్టు అసెంబ్లీ స్పీకర్ ను ఆదేశించింది. గడువుకు ఒక రోజు ముందుగా బుధవారం నాటికి మొత్తం పదిమంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ లపై స్పీకర్ తీర్పు వెలువరించేశారు. పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవంటూ , సాంకేతికంగా వారు బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారంటూ స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. చివరి విడతలో బుధవారం
ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై వచ్చిన ఫిర్యాదులను కొట్టివేసి వారు పార్టీ మారలేదంటూ తీర్పు ఇచ్చారు. అయితే కాంగ్రెస్, బీజేపీ స్పీకర్ తీర్పును తప్పుబట్టాయి. ప్రజాస్వామ్యానికి మూలమైన శాసన సభనే ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసిందంటూ మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి :

తెలంగాణ మాజీ మావోయిస్టులకి ఎన్ఐఏ నోటీసుల కలకలం!
GHMC Property Tax : ఆస్తి పన్ను చెల్లింపుదారులకు జీహెచ్ఎంసీ ఆఫర్ !

Latest News