బీజేపీలో చేరిన డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శ్రష్టివర్మ

డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ శ్రష్టి వర్మ బీజేపీలో చేరారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు ఆమెకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

Reported by: Tejaswini Nanna | వినోదం | Aug 17, 2026, 4:43 pm IST
Read Time: 3 mins
బీజేపీలో చేరిన డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శ్రష్టివర్మ

డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ శ్రష్టి వర్మ బీజేపీలో చేరారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఆమెకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శ్రష్టి వర్మతో పాటు మరికొంతమంది కూడా బీజేపీలో చేరారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు ఏకమవుతున్న తరుణంలో యువత రాజకీయాల్లోకి రావడం, అందునా బీజేపీలో చేరడం హర్షణీయమని ఈ సందర్భంగా రామచందర్‌రావు అన్నారు.

‘ఢీ’ కంటెస్టెంట్‌ టు కొరియోగ్రాఫర్‌..

శ్రష్టి వర్మ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా పట్టణంలో పుట్టి పెరిగిన శ్రష్టి వర్మ ఇంటర్ చదివారు. అదే సమయంలో ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఢీ’ డ్యాన్స్ కార్యక్రమంలో కో-డ్యాన్సర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఢీ-జోడీ’ కార్యక్రమంలో రాణించి అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా పలు సినిమాలకు పనిచేయడం మొదలు పెట్టారు. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి పెద్ద పెద్ద హీరోలకు కోరియో గ్రాఫర్ గా పనిచేశారు.ఇక జానీ మాస్టర్ పై శ్రష్టి వర్మ పోక్సో కేసు పెట్టడం అప్పట్లో సంచలనంగా మారింది. ‘పుష్ప2’లో ‘సూసేకి..’ పాట శ్రష్టి వర్మకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇక రజనీకాంత్‌ ‘జైలర్‌’లో ‘నువ్వు కావాలయ్యా’ పాటకు నృత్యరీతులు సమకూర్చారు. ‘క్రాక్‌’, ‘బీస్ట్‌’, ‘అల వైకుంఠపురములో’, ‘గేమ్‌ ఛేంజర్‌’, ‘కిసి కా భాయ్‌ కిసి కా జాన్‌’, ‘మనమే’ సహా పలు తెలుగు, తమిళ, హిందీ చిత్రాలకు ఆమె పనిచేశారు. ‘బిగ్‌ బాస్‌: సీజన్‌9’లోనూ కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు.