• Telugu News
  • /Telangana

తెలంగాణ మాజీ మావోయిస్టులకి ఎన్ఐఏ నోటీసుల కలకలం!

తెలంగాణలో మాజీ మావోయిస్టులకు ఎన్ఐఏ నోటీసులు జారీ కావడం కలకలం రేపింది. మావోయిస్టు నేత విఠల్ అంత్యక్రియలకు హాజరైన వారిని విచారణకు రావాలని ఆదేశించింది.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Mar 12, 2026, 2:02 pm IST
Read Time: 3 mins
తెలంగాణ మాజీ మావోయిస్టులకి ఎన్ఐఏ నోటీసుల కలకలం!

విధాత, హైదరాబాద్ : తెలంగాణలోని పలువురు మాజీ మావోయిస్టులకి ఎన్ఐఏ(NIA)నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది. ఓ వైపు మావోయిస్టులు జన జీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరోవైపు మాజీ మావోయిస్టులను కేసుల పేరుతో వేధించడం హాట్ టాపిక్ గా మారింది.

మావోయిస్టు అగ్రనేత కట్టా రాంచంద్రారెడ్డి అలియాస్ విఠల్ 2025 అక్టోబర్ 19న ఎన్ కౌంటర్లో మృతి చెందారు. విఠల్ అంత్యక్రియలు సిద్దిపేట జిల్లా కొహెడ మండలం తీగలగుంటపల్లిలో జరిగాయి. విఠల్ అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ మావోయిస్టులకు తాజాగా ఎన్ఐఏ నోటీసులు జారీ చేసింది.

విఠల్ అంత్యక్రియలకు హాజరైన హుజురాబాద్, భీందేవరపల్లి మండలాలకు చెందిన మాజీ మావోయిస్టులు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. ఎఫ్ఐఅర్ 4/25 కేసు దర్యాప్తులో భాగంగా వారి దగ్గర ఉన్న సమాచారాన్ని సేకరించేందుకు ఈనెల 25న హైదరాబాద్ లోని ఎన్ఐఏ కార్యాలయానికి రావాలని నోటీసులలో ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. ఈనెల 15 లోపు స్థానిక పోలీస్ స్టేషన్లో రిపోర్టు చేయాలని నోటీసులలో తెలిపారు. తాజా నోటీసుల నేపథ్యంలో లొంగిపోయిన మాజీ మావోయిస్టులకు కేసులు, విచారణల పేరుతో పోలీసుల వేధింపులు తప్పేలా లేవన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ రకమైన సమస్యలు లేకుండా జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టుల పట్ల ప్రభుత్వం, పోలీసులు ప్రజాస్వాయ్యయుతంగా వ్యవహారించాలన్న అభ్యర్థనలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :

GHMC Property Tax : ఆస్తి పన్ను చెల్లింపుదారులకు జీహెచ్ఎంసీ ఆఫర్ !
ఎల్పీజీ కొరతపై పార్లమెంటు ప్రాంగణంలో ప్రతిపక్షాల నిరసన!