LPG Gas ATM : గ్యాస్ పంపిణీకి ఎల్పీజీ ఏటీఎంలు!

దేశంలో గ్యాస్ సరఫరా సమస్యలకు చెక్ పెట్టేందుకు ఎల్పీజీ ఏటీఎంలు వచ్చాయి. ఓటీపీ, డిజిటల్ పేమెంట్‌తో 2 నిమిషాల్లోనే సిలిండర్ పొందే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.

LPG

విధాత : పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఎల్పీజీ గ్యాస్ కొరత తీవ్రమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో పంజాబ్ లోని ఎల్పీజీ ఏటీఎం దేశ వ్యాప్తంగా వైరల్ గా మారాయి. గురుగ్రామ్ లో ఏర్పాటైన ఎల్పీజీ ఏటీఎంలో ఖాళీ సిలిండర్‌ అప్పగించి.. ఓటీపీ సాయంతో డిజిటల్‌ పేమెంట్‌ చేసి.. వెంటనే 2నుంచి 3 నిమిషాల్లోనే కొత్త సిలిండర్‌ తీసుకోవచ్చు. ఇది బ్యాంకు ఏటీఎం మాదిరిగానే పని చేస్తుంది.ఇది 24×7 తెరిచి ఉంటుంది.

భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) కంపెనీ పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా ఈ ఎల్పీజీ ఏటీఎం ను ఏర్పాటు చేసింది. ఆధునిక ఆటోమేటెడ్ వెండింగ్ మెషిన్. ఎల్పీజీ ఏటీఎం ద్వారా ప్రస్తుతానికి ఫైబర్‌ సిలిండర్లు అందజేస్తుండగా..భవిష్యత్తులో సాధారణ స్టీల్ గ్యాస్ సిలిండర్లను కూడా అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.

ఏటీఎం సిలిండర్ల పనితీరు ఇలా..

ఎల్పీజీ ఏటీఎంలు పూర్తిగా డిజిటల్, ఆటోమేటెడ్ ప్రక్రియతో నిర్వహించబడుతాయి. మెషిన్ వద్దకు వెళ్లి కస్టమర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. OTP ద్వారా వెరిఫై చేయబడుతుంది. ( ఇందుకు మీ భారత్ గ్యాస్ కనెక్షన్ లింక్ అయి ఉండాలి).
మీ ఖాళీ సిలిండర్ పై ఉన్న బార్‌కోడ్ లేదా QR కోడ్ స్కాన్ చేయాలి. డిజిటల్ పేమెంట్ చేయాలి. మెషిన్ మీ కనెక్షన్‌ను చెక్ చేసి (ఎలిజిబిలిటీ వెరిఫై) నిండు సిలిండర్ బయటకు ఇస్తుంది. అదే సమయంలో ఖాళీ సిలిండర్‌ను మెషిన్ లోపలికి తీసుకుంటుంది. ఈ ప్రక్రియ అంతా 2నిమిషాల్లోనే పూర్తవుతుంది. గ్యాస్ సబ్సిడీ కస్టమర్ బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. డ్యామేజ్ అయిన సిలిండర్లన ఏటీఎం స్వీకరించదు.

భవిష్యత్తులో దేశమంతా విస్తరణ

ప్రస్తుతం దేశంలో అనేక ప్రాంతాల్లో గ్యాస్ ఏజెన్సీల వద్ద లైన్లుగా నిలబడటం లేక బుకింగ్ చేశాక రోజుల తరబడి వేచి ఉండటం వంటి సమస్యలు కొనసాగుతున్నాయి. ఎల్‌పీజీ ఏటీఎంలతో ఈ తరహా సమస్యలకు చెక్ పడనుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. భారతదేశంలో మొదటి ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత ఎల్పీజీ ఏటీఎంలు బెంగళూరు, గురుగ్రామ్ (గుర్గావ్) వంటి ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఢిల్లీ, జైపూర్, ముంబై వంటి నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. త్వరలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తారని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

Union Cabinet : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
Helicopter Crash In Nepal | హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్..వీడియో వైరల్

Latest News