• Telugu News
  • /National

Union Cabinet : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇండస్ట్రియల్ పార్కులు, జాతీయ రహదారులు, పత్తి MSP, చిన్న జల విద్యుత్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Mar 18, 2026, 5:43 pm IST
Read Time: 4 mins
Union Cabinet : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. కొత్తగా భారత్ ఔద్యోగిక్‌ వికాస్ యోజన (భవ్య) పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద 33,600 కోట్ల రూపాయల ఖర్చుతో 100 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేయనున్నారు. 100నుంచి 1000 ఎకరాల పరిధిలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో భవ్య ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు జరగనుంది. ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. భారతదేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడమే ఈ పథకం లక్ష్యమన్నారు. భారతదేశంలో తయారైన వస్తువులను ప్రపంచవ్యాప్తంగా విక్రయించడమే లక్ష్యంగా ఉన్న ‘మేక్ ఇన్ ఇండియా’కు ఇది ఒక విస్తృత రూపమని కేంద్ర మంత్రి తెలిపారు.

అలాగే యూపీలో బారాబంకి నుంచి బహరాజ్ వరకు 101 కిలోమీటర్ల పొడవైన నాలుగు లైన్ల యాక్సిస్ కంట్రోల్ జాతీయ రహదారి నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ జాతీయ రహదారి నిర్మాణానికి రూ.6969 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది.

ఇక పత్తి గిట్టుబాటు ధరల నిధికి రూ. 1718 కోట్ల రీయింబర్స్ మెంట్ కి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2023-24 పత్తి సీజన్ లో ఎంఎస్పీ కోసం సీసీఐకి కేటాయింపునకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా కేంద్రం భరోసా కల్పించింది.

NH-92 బారాబంకి నుండి బహ్రైచ్ సెక్షన్ వరకు నాలుగు లేన్ల నిర్మాణానికి రూ. 6,969 కోట్లు కేటాయిస్తు నిర్ణయం తీసుకుంది. చిన్న జల విద్యుత్ అభివృద్ధి పథకానికి రూ.2,585 కోట్లు కేటాయించింది. దేశవ్యాప్తంగా సుమారు 1500 మెగావాట్ల (MW) విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల చిన్న నీటి విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానంగా 1 నుంచి 25 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులకు ఈ పథకం కింద మద్దతు లభిస్తుంది. రాష్ట్రాలకు లభించే ఆర్థిక ప్రోత్సాహకాలు ఈ పథకం ద్వారా కొండ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలకు మెరుగైన ప్రయోజనం చేకూరనుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి :

Tandur MLA Manohar Reddy : తాండూరు యువతను నాశనం చేశాడు
Mallikarjun Kharge | మమ్మల్ని ప్రేమించి.. మోదీని పెళ్లాడారు.. : దేవెగౌడపై ఖర్గే సెటైర్‌