విధాత, హైదరాబాద్: తెలంగాణ సీఎస్ కె.రామకృష్ణారావు పదవీ కాలాన్ని కేంద్రం మరోసారి పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వ వినతిని అంగీకరించిన కేంద్రం సీఎస్ పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించింది.
గతేడాది ఏప్రిల్ 30న సీఎస్‌గా రామకృష్ణారావు బాధ్యతలు చేపట్టారు. గతేడాది ఆగస్టులోనే ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. అప్పుడు ఏడు నెలలు పొడిగించింది. ఇప్పుడు మరోసారి మరో మూడు నెలలు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం విశేషం.
ఇవి కూడా చదవండి :
మూసీ బునాదిగాని కాలువలోకి కాళేశ్వరం నీళ్లు !
LPG Gas ATM : గ్యాస్ పంపిణీకి ఎల్పీజీ ఏటీఎంలు!
