విధాత : భారత్ లోని ఆసియా అడవి ఏనుగుల జీవన శైలీ ఎంతో ప్రత్యేకం..ఆసక్తికరం. అటవీ జీవితంలో మొరటుగా వ్యవహరించడంతో పాటు మనుషులకు మచ్చిక కావడంలోనూ ఆసియా ఏనుగులు తెలివిగా వ్యవహరిస్తుంటాయి. చాలా వరకు ఏనుగులను మైదాన ప్రాంత జంతువులుగానే పరిగణిస్తుంటారు. కానీ వాస్తవం అంతకంటే చాలా ఆసక్తికరమైనది. ఆసియా ఏనుగులు అద్భుతంగా స్థిరమైన అడుగులు వేస్తూ…నిటారుగా ఉండే కొండలను, రాతి వాలులను కూడా అధిగమించగలవని గతంలో పలు ఘటనలు రుజువు చేశాయి. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లోని నీలగిరి కొండలపై నిటారుగా ఉన్న కొండ వాలును అధిరోహిస్తున్న ఓ ఆసియా ఏనుగు ఫోటోలు సోషల్ మీడియాల్ వైరల్ గా మారాయి.
అరుణాచల్ ప్రదేశ్‌లో నీలగిరి పర్వతంపై సముద్ర మట్టానికి 3,266 మీటర్ల ఎత్తులో సంచరిస్తున్న ఆసియా అడవి ఏనుగు సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఆసియా ఏనుగుల సంచారం విషయంలో ఇప్పటివరకు ప్రపంచంలో నమోదైన అత్యధిక ఎత్తు ఇదే కావడం గమనార్హం. ఆగస్టు 12న జరుపుకునే ప్రపంచ ఏనుగులదినోత్సవానికి ముందు భారత ఏనుగు పేరిట అద్భుత రికార్డు నమోదు కావడం ఆసక్తికరం. నీలగిరి కొండపై భారీ ఏనుగు అధిరోహించిన ప్రాంతం కామెంగ్ ఎలిఫెంట్ రిజర్వ్‌లో భాగంగా ఉంది.
ఇంతకు ముందు అరుణాచల్‌లో ఏనుగులు సాధారణంగా తక్కువ ఎత్తుల్లోనే (2,000 మీటర్ల వరకు) కనిపించేవి. స్థానిక బుగున్, షెర్డుక్పెన్ కమ్యూనిటీలకు ఎత్తైన ప్రాంతాల్లో ఏనుగులు తిరగడం తెలుసు. కానీ 3,266 మీటర్ల స్థాయిలో కెమెరా ట్రాప్ సాక్ష్యం ఇప్పుడే వచ్చింది. ఈ ఫోటోను తమిళనాడు ప్రభుత్వంలో అదనపు చీఫ్ సెక్రటరీ,వాతావరణం, వన్యప్రాణుల పరిశోధకురాలు సుప్రియాసాహు పోస్టు చేయడంతో విషయం వెలుగుచూసింది. ఆఫ్రికన్ ఏనుగులు మౌంట్ కెన్యాలో సుమారు 4,000 మీటర్ల వరకు వెళ్లిన రికార్డులు ఉన్నాయి. ఆ రికార్డుకు సమీపంగా ఆసియా ఏనుగులకు సంబంధించి భారత ఏనుగు ప్రపంచంలోనే అత్యధిక ఎత్తుకు వెళ్లిన రికార్డు నమోదు చేయడం ఆసక్తికరం.
Look closely, there is an elephant on that steep hill. Many people imagine elephants as animals of the plains. But the truth is far more fascinating. Asian elephants are remarkably sure-footed and can negotiate surprisingly steep hills and rocky slopes.
This photograph captures… pic.twitter.com/B3TtccUb4X
— Supriya Sahu IAS (@supriyasahuias) August 11, 2026