విధాత : కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వరద నీటి ఉదృతితో ప్రవహిస్తున్న నదిలో స్విమ్మింగ్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఈత రాకపోతే ఎప్పుడూ లోతైన నీటిలోకి వెళ్లకండి. నదిలో చాలా మంది మునిగి చనిపోయారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని నదులు చాలా పెద్దవి మరియు అత్యంత లోతైనవంటూ తన స్విమ్మింగ్ వీడియోతో ఆయన పర్యాటకులకు, యువతకు సందేశమిచ్చారు.
కిరణ్ రిజిజు ఒక చెట్టు కొమ్మ నుండి వేగంగా ప్రవహిస్తున్ననదిలోకి దూకి, బలమైన ప్రవాహంతో ఈదుతూ, నీటిపై తన నియంత్రణను ప్రదర్శిస్తూ సురక్షితంగా ఒడ్డుకు వచ్చారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని పెద్ద, లోతైన నదులలో ఈత రాని వారికి మునిగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉందని, లోతైన నీటిలోకి దిగే ముందు జాగ్రత్త వహించాలని కిరణ్ రిజిజు హెచ్చరిస్తున్నారు.
స్విమ్మింగ్ పూల్ లో లేదా యమున వంటి ప్రశాంతమైన నదులలో ఈత కొట్టడానికి భిన్నంగా, అరుణాచల్ ప్రదేశ్ లో పర్వత ప్రాంతాల గుండా ఉదృతమైన వేగంతో ప్రవహించే నదులలో ఈత కొట్టడానికి తల పైకి ఎత్తి, నిటారుగా శరీరాన్ని ఉంచుకోవాలని ఆయన వివరించారు. స్థానిక పరిస్థితులపై తనకు అనుభవం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు.
Never go to deep water, if you do not know swimming. Many people have drowned in the river. The rivers in Arunachal Pradesh are huge and very deep. pic.twitter.com/ITrb8S3MzN
— Kiren Rijiju (@KirenRijiju) August 23, 2026