అరుణాచల్ ప్రదేశ్‌ను తమ భూభాగంగా చైనా క్లెయిమ్ చేసుకుంటున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన ఓ చిన్నారి మాట్లాడిన మాటల వీడియో వైరల్ గా మారింది. ‘మమ్మల్ని చైనీయులు అని పిలవకండి.. మేము గర్వించదగ్గ భారతీయులం’ అంటూ ఇటానగర్‌కు చెందిన చిన్నారి చెప్పిన ముద్దుముద్దు మాటల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మీరు చైనీయులా?’ అని ఒకరు ప్రశ్నించినందుకు.. తాము చైనీస్ కాదని చిన్నారి వీడియోలో స్పష్టం చేసింది. ‘మేమూ భారతీయులమే.. మమ్మల్ని చైనీస్ అని పిలవకండి’ అని, చైనీస్ అని పిలిస్తే కోపం వస్తుందని.. మమ్మల్ని ఇండియన్స్ అని పిలవాలంటూ విజ్ఞప్తి చేసింది. ‘మాతో చైనీస్‌లో మాట్లాడితే కోపం, బాధ కలుగుతాయి అని, మమ్మల్ని ఇండియన్స్ అని మాత్రమే పిలవండి’ అని పాప వీడియోలో స్పష్టం చేసింది.
ఆ చిన్నారిలోని దేశభక్తిని మెచ్చుకుంటూ వేలాది మంది నెటిజన్లు “లవ్ యూ రా చిట్టితల్లి.. నీ దేశభక్తి సూపర్” అంటూ వేలాది కామెంట్లతో అభినందిస్తున్నారు.
అరుణాచల్ ప్రదేశ్ లోని భారత భూభాగంలోకి చైనా సైన్యం 60కిలో మీటర్లు చొచ్చుకవచ్చిందని ఇటీవల ఆ రాష్ట్రం నుంచి వార్తలు వెలువడటం కలకలం రేపింది. అరుణాచల్ ప్రదేశ్ లోని చాల ప్రాంతాల్లో చైనా సైన్యం తిష్టవేసిందని బీజేపీ మిత్రపక్షమైన అరుణాచల్ ప్రదేశ్ పీపుల్స్ పార్టీ సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కొట్టిపారేశారు.ఇరుదేశాల మధ్య సరిహద్దులపై స్పష్టత లేనందునే ఇలాంటి వార్తలు వస్తున్నాయని, దేశాన్ని పాలించిన గత ప్రభుత్వాల వైఖరితోనే ఇలాంటి ఉద్రిక్తతల పరిస్థితి నెలకొందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం సరిహద్దుల్లో మౌలిక సదుపాయలను అభివృద్ది చేస్తుందని తెలిపారు.
A child from #Itanagar #ArunachalPradesh voiced her frustration over people from the Northeast being stereotyped as Chinese. She says, “We are Indians, don’t call us Chinese.”#NortheastIndia #StopRacism #UnityInDiversity pic.twitter.com/vgGbCxg6de
— Chandrakant (@shindeckant) August 20, 2026