ఉత్తరాఖండ్‌లో భారీ వరదలు..క్షణాల్లో కొట్టుకపోయిన వంతెన

చమేలీ జిల్లాలోని నితిన్ లోయ వద్ద వరద ఉదృతికి ఓ వంతెన పేక మేడలా కొట్టుకుపోయింది. కొండపై నుంచి ఒక్కసారిగా వచ్చిన ప్రవాహంతో స్టీల్ వంతెన కొట్టుపోయిన వీడియో వైరల్ అవుతోంది.

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | Aug 11, 2026, 11:35 am IST
Read Time: 3 mins
ఉత్తరాఖండ్‌లో భారీ వరదలు..క్షణాల్లో కొట్టుకపోయిన వంతెన

విధాత : ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు, వరదలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. అనేక ప్రాంతాలు, గ్రామాలు వరద ఉదృతిలో చిక్కుకున్నాయి.నదులు ప్రమాదకర స్థాయిలో వేగంగా ప్రవహిస్తూ భారీ నష్టాన్ని కల్గిస్తున్నాయి. చమేలీ జిల్లాలోని నితిన్ లోయ వద్ద వరద ఉదృతికి ఓ వంతెన పేక మేడలా కొట్టుకుపోయింది. కొండపై నుంచి ఒక్కసారిగా వచ్చిన ప్రవాహంతో స్టీల్ వంతెన కొట్టుపోయిన వీడియో వైరల్ అవుతోంది. బురదతో కలిసిన నీటి ప్రవాహం కొండపై నుంచి ఉధృతంగా ప్రవహించి వంతెనను బలంగా ఢీకొట్టడం..క్షణాల్లో నీటి ఉధృతికి వంతెన కూలిపోయి నదిలో కొట్టుకుపోయింది.

వంతెన కొట్టుకపోవడానికి ముందే ఆ మార్గంలో వచ్చిన ట్రక్కు, కారులను వెనక్కి మళ్లించడం ద్వారా పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాయి. జ్యోతిర్మఠ్-మలారి రహదారిపై కొత్తగా నిర్మించిన బీఆర్వో వంతెన కొట్టుకుపోవడంతో, 12-16 సరిహద్దు గ్రామాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది. ఈ ఘటనలో ఒక బీఆర్వో ఉద్యోగి గల్లంతవ్వగా, SDRF మరియు NDRF సహాయక బృందాలను రంగంలోకి దించారు. లోయలోని నదులు, వాగుల పరిసర ప్రాంతాలలో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.