Ditwah Cyclone : దిత్వా తుపాన్ తో శ్రీలంక విలవిల..భారత్ ఆపన్న హస్తం

దిత్వా తుపాన్ ధాటికి శ్రీలంక అతలాకుతలమైంది. భారీ వర్షాలు, వరదలతో 125 మంది మరణించారు. ఈ నేపథ్యంలో పొరుగు దేశానికి భారత్ 'సాగర్ బంధు' పేరుతో ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ ద్వారా మానవతా సాయం అందించింది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Nov 29, 2025, 3:30 pm IST
Read Time: 2 mins
Ditwah Cyclone : దిత్వా తుపాన్ తో శ్రీలంక విలవిల..భారత్ ఆపన్న హస్తం

న్యూఢిల్లీ: దిత్వా తుపాన్ ధాటికి శ్రీలంక అతలాకుతలమైంది. వర్షాలు, వరదలతో ఇప్పటిదాక 125మంది వరకు చనిపోయారు. 34మంది ఆచూకీ తెలియరాలేదు. రోడ్లు, విద్యుత్తు, రవాణా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరద ప్రాంతాల్లో ప్రజలు సహాయం కోసం అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో పొరుగు దేశం శ్రీలంకకు భారత్ అండగా నిలబడింది. ‘సాగర్ బంధు’ పేరుతో ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ ద్వారా మానవతా సాయం అందించింది. రిలీఫ్ మెటీరియల్, రేషన్, క్రిటికల్ పప్లయ్స్, రెడీ టు ఈట్ ఫుడ్ వంటి సామగ్రితో పాటు 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా కొలంబోకి పంపింది.

శ్రీలంకను అల్లకల్లోలం చేసిన దిత్వా తుపాన్ శ్రీలం తీరం నుంచి ఆగ్నేయ దిశగా కదులుతూ..తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల వైపు దూసుకొస్తుంది. దీంతో ఈ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. దిత్వా తుఫాన్ ప్రభావంతో నవంబర్ 30న ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం కోస్తా జిల్లాల్లో పలు చోట్ల, రాయలసీమలో కూడా అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని తెలిపింది.