Tomcom | విదేశాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశం వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ టామ్‌కమ్ (TOMCOM) ద్వారా ఒమన్‌లోని ప్రముఖ సంస్థలో చీఫ్ ప్రాజెక్ట్ అండ్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు భారీ జీతంతో నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజినీరింగ్ ఫీల్డ్‌లో ఉన్న వారికి ఇదొక మంచి అవకాశమని టామ్‌కమ్ తెలిపింది. ఈ పోస్టుకు ఎంపికైతే నెలకు సుమారు రూ.22,81,000 వరకు జీతం అందనుంది. మన కరెన్సీలో ఇది చాలా గొప్ప అవకాశమే చెప్పొచ్చు.
అర్హతలు
ఈ ఉద్యోగానినికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంజినీరింగ్ బ్యాచిలర్ లేదా మాస్టర్స్‌లో (మైనింగ్/మెకానికల్/సివిల్/ప్రాసెస్) పూర్తి చేసి ఉండాలి. ఎంబీఏ చేసిన వారికి ప్రాధాన్యమివ్వబడును. కనీసం 15 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయసు 30 నుంచి 58 సంవత్సరాలలోపు ఉండాలి. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నైపుణ్యం ఉండాలని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) తెలిపింది.
బాధ్యతలేంటి?
* ఇంజినీరింగ్ & టెక్నికల్ ప్రాజెక్టులకు నాయకత్వం వహించాలి.
* ప్రాజెక్ట్ ప్లానింగ్ నుంచి ఎగ్జిక్యూషన్, డెలివరీ వరకు పర్యవేక్షించాలి.
* టీమ్‌లకు టెక్నికల్ మార్గదర్శకం ఇవ్వాలి.
* సేఫ్టీ, క్వాలిటీ స్టాండర్డ్స్ పాటించాలి
* క్లయింట్స్& కాంట్రాక్టర్లతో సమన్వయం చేయాలి.
* ప్రాజెక్టు పనితీరును పర్యవేక్షించాలి.
దరఖాస్తు విధానం
అన్ని అర్హతలు గల అభ్యర్థులు తమ రెజ్యూమ్‌ను tomcom.resume@gmail.com అడ్రస్‌కు మెయిల్ చేయాలని టామ్‌కమ్ సంస్థ తెలిపింది. మరిన్ని వివరాలకు 94400 51285, 94400 51452 నంబర్లలో సంప్రదించాలని సూచించింది. సీనియర్ లెవల్‌లో విదేశీ ఉద్యోగంతో పాటు భారీ జీతం లభిస్తుంది కాబట్టి అర్హులు ఈ ఛాన్స్‌ను మిస్ చేసుకోవద్దని టామ్‌కమ్ సలహానిస్తుంది.
Read More :
వెల్డింగ్ పని తెలిస్తే నెలకు రూ.4లక్షలు.. ఆస్ట్రేలియాలో ఉద్యోగవకాశం!
