ప్రపంచ మార్కెట్‌లో అతి విలువైన లోహాల ధరలు పెరిగాయి. బంగారం, వెండి ధరలు (Silver Jewellery) రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా వెండి ఆభరణాల ధరలు ఎన్నడూ లేని విధంగా పెరిగిపోయాయి. ఒకప్పుడు సామాన్యులు బంగారం కొనలేకపోయినా వెండి వస్తువులను కొనేవారు. కానీ ఇప్పుడు బంగారం కంటే వెండి ధరలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో వెండి రూ.2,69,000గా ఉంది.
వెండిపై దొంగల కన్ను..
ఇలా ధరలు పెరుగుతుండటంతో ప్రస్తుతం దొంగల కన్ను వెండిపై నడింది. ఒకప్పుడు బంగారు ఆభరణాల కోసం ఇళ్లలో చేరీలకు పాల్పడేవారు. కానీ ఇప్పుడు వెండి వస్తువులపై దొంగల చోరీలు మొదలు పెట్టారు. తాజాగా రాజస్థాన్ (Rajasthan)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వెండి ఆభరణాల కోసం దొంగలు.. ఓ వృద్ధురాలిని మంచంతో సహా ఎత్తుకెళ్లిపోయారు. భిల్వారా (Bhilwara) జిల్లాలో బుధవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
వృద్ధురాలి ఒంటిపై 2 కిలోల ఆభరణాలు
జిల్లాలోని కోథియా గ్రామ మాజీ సర్పంచ్ నాథీ దేవి ఇంట్లో చోరీకి దొంగలు ప్రయత్నించారు. ఇంట్లోకి ప్రవేశిస్తుండగా.. వారికి వరండాలో 90 ఏళ్ల వృద్ధురాలు చోటీ దేవి కనిపించింది. ఆ వృద్ధురాలి ఒంటిపై దాదాపు రెండు కిలోల విలువైన వెండి ఆభరణాలు ఉండటం గమనించారు. వాటిని దొంగలించేందుకు పథకం వేశారు.
మంచంతో సహా ఎత్తుకెళ్లిపోయారు..
ఇంట్లో వాళ్లు బయటకు రాకుండా మెయిన్ డోర్‌కు తాళం వేశారు. అనంతరం వృద్ధురాలి ఒంటిపై ఉన్న నగలను తీస్తే ఆమె నిద్రలేచి అరుస్తుందని భావించిన దొంగలు.. ముందుగా ఆమె నోటికి ప్లాస్టర్ వేసి కాళ్లు, చేతులు కట్టేశారు. అనంతరం మంచంతో సహా ఆమెను ఎత్తుకెళ్లిపోయారు. అయితే అలికిడికి ఇంట్లో నిద్రిస్తున్న కుటుం సభ్యులు లేచిచూడగా.. వరండాలో వృద్ధురాలు కనిపించలేదు. దీంతో ఆందోళన కుటుంబ సభ్యులు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. రోడ్ లాక్‌లో ఉందని తెలుసుకున్నారు. దీంతో స్థానికులను అప్రమత్తం చేశారు. వారొచ్చి తాళం తీయడంతో కుటుంబ సభ్యులు బయపడ్డారు.
వృద్ధురాలి కోసం వేట..
అంతా కలిసి వృద్ధురాలి కోసం వెతకసాగారు. గ్రామస్థులను గుర్తించిన దొంగలు ఆమెను పొలంలో వదిలేసి అక్కడి నుంచి ఉడాయించారు. కుటుంబ సభ్యులు వెళ్లి వృద్ధురాలిని రక్షించి ఇంటికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. దొంగలను పట్టుకునేందుకు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ఇవి కూడా చదవండి :
U19 World Cup Final : అండర్ 19 ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ టార్గెట్ 412
96 Yr Old Woman Performs Bharatanatyam | 96 ఏళ్ల వయసులో.. స్టేజ్‌పై భరతనాట్యంతో ఆకట్టుకున్న బామ్మ.. నెటిజన్లు ఫిదా
