• Telugu News
  • /National

96 Yr Old Woman Performs Bharatanatyam | 96 ఏళ్ల వ‌య‌సులో.. స్టేజ్‌పై భ‌ర‌త‌నాట్యంతో ఆక‌ట్టుకున్న బామ్మ‌.. నెటిజ‌న్లు ఫిదా

96 ఏళ్ల వయసులోనూ స్టేజ్‌పై భరతనాట్యం చేసి బామ్మ అందరినీ ఆశ్చర్యపరిచింది. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ఆమె డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Feb 06, 2026, 5:07 pm IST
Read Time: 5 mins
96 Yr Old Woman Performs Bharatanatyam | 96 ఏళ్ల వ‌య‌సులో.. స్టేజ్‌పై భ‌ర‌త‌నాట్యంతో ఆక‌ట్టుకున్న బామ్మ‌.. నెటిజ‌న్లు ఫిదా

వ‌య‌సు శ‌రీరానికే గానీ మ‌న‌సుకు కాదు. ఏదైనా సాధించాల‌న్న సంక‌ల్పం, ప‌ట్టుద‌ల ఉంటే చాలు వ‌య‌సుతో సంబంధం లేకుండా అనుకున్న‌ది సాధించొచ్చు. అందుకు నిద‌ర్శ‌న‌మే ఈ వృద్ధురాలు. 96 ఏళ్ల వ‌య‌సులోనూ ఆమె ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ (96 year old woman dance) చేస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు.

చెన్నైలోని ముధియోర్ తిరువిళ (Mudhiyor Thiruvizha)లో జ‌రిగిన నృత్య ప్ర‌ద‌ర్శ‌న కార్య‌క్ర‌మంలో 96 ఏళ్ల వృద్ధురాలు భ‌ర‌త‌నాట్యం చేసి అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. ఆత్మ‌విశ్వాసం, చిరున‌వ్వుతో స్టేజ్‌పై అడుగుపెట్టిన ఆ బామ్మ‌.. ముఖ కవళికల‌తో (Facial Expressions) ఎంతో అద్భుతంగా నృత్యం చేసి ఆక‌ట్టుకుంది. వ‌య‌స్సు కేవ‌లం సంఖ్య మాత్ర‌మేన‌ని త‌న డ్యాన్స్ ప‌ర్ఫామెన్స్‌తో ప్ర‌పంచానికి చాటిచెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.

నెటిజ‌న్లు ఫిదా

ఆ వీడియోలు చూసిన నెటిజ‌న్లు బామ్మ నృత్యానికి ఫిదా అవుతున్నారు. నువ్వు సూపర్ బామ్మ అంటూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. బామ్మ నృత్యాన్ని చూసి మైమ‌ర‌చిపోతున్నారు. 96 ఏళ్ల వ‌య‌సులో ఎంతో ఉత్సాహంగా, అద్భుతంగా డ్యాన్స్ చేశారు అంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఈ వీడియో ఎంతో మందిలో స్ఫూర్తిని నింపుతుంద‌ని కొనియాడుతున్నారు.

గ‌తంలోనూ..

తమిళనాడుకు చెందిన ఈ బామ్మ గ‌తంలోనూ త‌న డ్యాన్స్‌తో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. గ‌తంలో ఓసారి త‌మిళ పాట‌కు స్టెప్పులు ఇర‌గ‌దీశారు. అప్పుడు ఆమె డ్యాన్స్ వీడియో సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ట్రెండ్ అయ్యింది. నెటిజ‌న్లు ఆ వృద్ధురాలి డ్యాన్స్‌కు ఫిదా అయ్యారు. హీరోయిన్‌లాగా హావ‌భావాలు ప‌లికిస్తూ డ్యాన్స్ చేశారు అంటూ కామెంట్లు పెట్టారు. అప్ప‌ట్లో ఆ బామ్మ వ‌య‌సు 90 ఏళ్లు. ఆ త‌ర్వాత కూడా కొన్ని డ్యాన్స్ వీడియోలు వ‌చ్చాయి. ఇప్పుడు 96 ఏళ్ల వ‌య‌సులో మ‌రోసారి త‌న డ్యాన్స్‌తో నెటిజ‌న్ల‌ను ప‌ల‌క‌రించారు ఈ బామ్మ‌.

ఇవి కూడా చదవండి :

Chandrababu : భూ రికార్డులను ట్యాంపర్ చేస్తే జైలుకే
Trisha-Nayan | త్రిష – నయనతార కోల్డ్ వార్ ముగిసిందా .. వారి ఆస్తులు గురించి తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవ‌ల్సిందే..!