U19 World Cup Final : అండర్ 19 ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ టార్గెట్ 412
అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ (175) విధ్వంసంతో యువ భారత్ 411 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌కు 412 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
విధాత : అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్ లో ఇంగ్లాండ్ ముందు యువ భారత్ 412పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకపడి ఫాస్టెస్టు సెంచరీ(80బంతుల్లో 15 ఫోర్లు, 15సిక్సర్లు, 175 పరుగులు)తో భారత్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 411 పరుగులు చేసింది. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ తో భారత్ ఓ దశలో 20ఓవర్లకే 180పరుగులు చేసింది. వైభవ్ 55బంతుల్లో 8ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత మరింత రెచ్చిపోయిన వైభవ్ ధాటికి 25.3ఓవర్లలోనే 251 పరుగు చేసింది. మూడో వికెట్ గా వైభవ్ ఔటయ్యక వరుస వికెట్లు కోల్పోయింది. 34.2 ఓవర్లకు భారత్ 302-4గా ఉన్న యువ భారత్.. మిగతా బ్యాటర్లు కూడా తమవంతుగా రాణించడంతో 411పరుగులకు చేరింది.
యువ భారత్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ అరోన్ జార్జి (9) జట్టు స్కోర్ 20పరుగుల వద్ద 3.6ఓవర్ లో అలెక్స్ గ్రీన్ బౌలింగ్‌లో తొలి వికెట్ గా ఔటయ్యాడు. వైభవ్ సూర్యవంశీతో కలిసి కెప్టెన్ ఆయూశ్ మాత్రే(53) రెండో వికెట్ కు 142పరుగులు భారీ భాగస్వామ్యం నమోదు చేసి రెండో వికెట్ గా వెనుతిరిగాడు. 18.6 ఓవర్లలో 162పరుగుల వద్ద అలెక్స్ గ్రీన్ బౌలింగ్‌లో బెన్ మేయెస్‌కు క్యాచ్ ఇచ్చి ఆయుష్ మాత్రే ఔటయ్యాడు. ఆ తర్వాత వేదాంత్ త్రివేది(32), విహాన్ మల్హోత్రా(30), అభిజ్ఞాన్ కుందు (40), అంబరీష్ (18) పరుగులు సాధించారు.కినాల్ పటెల్ (3). హెనిల్ పటేల్ (5 రనౌట్), కనిష్క్ చౌహన్(37 నాటౌట్, 19బాల్స్), దీపేష్(0*) పరుగులతో జట్టు స్కోర్ ను 400మార్క్ దాటించారు.
ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ మింటో 3, అలెక్స్ గ్రీన్, మోర్గాన్ తలో 2వికెట్లు, ఆల్బర్ట్ 1 వికెట్ సాధించారు.
అండర్ 19లో వైభవ్ రికార్డుల మోత
అండర్ 19 టోర్నమెంట్ లో సూపర్ సెంచరీ(175)తో వైభవ్ తన తొలి సెంచరీ నమోదు చేశాడు. ప్రపంచకప్‌లో వేగవంతమైన సెంచరీ సాధించిన రెండో అటగాడిగా(55 బంతుల్లో 100)గా నిలిచాడు. ఆసీస్ బ్యాటర్ విల్(51 బంతులు) ఇదే సిరీస్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదాడు. అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్‌లో సెంచరీ చేసిన మూడో టీమ్‌ఇండియా బ్యాటర్ కూడా సూర్యవంశీ నిలిచాడు. ఇంతకుముందు ఉన్‌మక్త్ చంద్, మన్‌జోత్ కల్రా ఈ జాబితాలో ఉన్నారు. ప్రపంచకప్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్ గా కూడా సూర్యవంశీనే(15 సిక్స్‌లు) రికార్డు నమోదు చేశాడు. ఒక ఇన్నింగ్స్ లో 71బంతుల్లో 150 పరుగులు చేసిన ఆటగాడిగా కూడా రికార్డు సాధించారు.
ఇవి కూడా చదవండి :
96 Yr Old Woman Performs Bharatanatyam | 96 ఏళ్ల వయసులో.. స్టేజ్‌పై భరతనాట్యంతో ఆకట్టుకున్న బామ్మ.. నెటిజన్లు ఫిదా
Chandrababu : భూ రికార్డులను ట్యాంపర్ చేస్తే జైలుకే
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram