కట్నంగా కారు ఇవ్వలేదని వరుడు పరార్.. పొలాల్లో పరుగులు!

రాజస్ధాన్ లో పెళ్లి సమయంలో వధువు కుటుంబం తనకు 'మహీంద్రా స్కోర్పియో' కారు ఇవ్వలేదన్న కోపంతో వరుడు మండపం నుంచి అకస్మాత్తుగా పరారయ్యాడు. పెళ్లి తంతు మధ్యలో వరుడు పారిపోవడంతో వివాహ వేడుక గందరగోళంగా మారిపోయింది. ఈ ఊహించని పరిణామంతో షాకైన పెళ్లి బృందం, వధువు తరపు వారు అతడిని పొలాల్లో వెంటాడి మరి పట్టుకున్నారు.

కట్నంగా కారు ఇవ్వలేదని వరుడు పరార్.. పొలాల్లో పరుగులు!

విధాత : వరకట్న దురాచారం ఆధునిక సమాజంలోని తన పంజా విప్పుతునే ఉంది. లింగ నిష్పత్తి తేడాలు పెరిగిపోయి..ఆడ పిల్లల సంఖ్య తగ్గిపోయి పెళ్లికి వధువు దొరకని రోజుల్లో కూడా వరకట్నం మాత్రం తప్పడం లేదు. వరకట్న దురాచారం వంటి సాంప్రదాయాలు అధికంగా కనిపించే రాజస్థాన్ రాష్ట్రంలో వరుడి వరకట్నం డిమాండ్ దెబ్బకు ఓ పెళ్లి ఆగిపోయింది.

పెళ్లి సమయంలో వధువు కుటుంబం తనకు ‘మహీంద్రా స్కోర్పియో’ కారు ఇవ్వలేదన్న కోపంతో వరుడు మండపం నుంచి అకస్మాత్తుగా పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింగా వైరల్ గా మారింది. పెళ్లి తంతు మధ్యలో వరుడు పారిపోవడంతో వివాహ వేడుక గందరగోళంగా మారిపోయింది. ఈ ఊహించని పరిణామంతో షాకైన పెళ్లి బృందం, వధువు తరపు వారు అతడిని పొలాల్లో వెంటాడి మరి పట్టుకున్నారు. బంధువులు వెంబడిస్తున్నా వారి నుంచి తప్పించుకొని వరుడు పెళ్లి బట్టలతోనే పొలాల్లో  పరుగులు పెట్టాడు.

చివరకు అతికష్టం మీద అతడిని పట్టుకుని పెళ్లి మండపానికి తీసుకొచ్చారు. .సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు,  నివేదికల ప్రకారం వరుడి నిర్వాకాన్ని అవమానంగా భావించిన..అతడి ప్రవర్తన నచ్చని  వధువు పెళ్లిని రద్దు చేసుకుంది. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వరుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.