Marriage | 2026లో ఈ నాలుగు రాశుల వారికి పెళ్లి ఖాయం..! మ‌రి మీ రాశి ఉందా..?

Marriage | వివాహ వ‌య‌సొచ్చిన కూడా చాలా మందికి పెళ్లిళ్లు( Marriages ) కావు. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా పెళ్లి పీట‌లెక్క‌రు. కానీ వ‌చ్చే 2026 ఏడాది మాత్రం ఈ నాలుగు రాశుల( Zodiac Signs ) వారికి క‌లిసి రానుంది. ఈ నాలుగు రాశుల వారికి త‌ప్ప‌కుండా పెళ్లి జ‌ర‌గ‌నుంది. అందులో మీ రాశి ఉందో లేదో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

Marriage | పెళ్లి కాని వారికి శుభ‌వార్త‌. ఎన్నో సంబంధాలు చూసిన‌ప్ప‌టికీ వివాహం( Marriage ) కాని వారికి 2026 ఏడాది క‌లిసి రానుంది. త‌మ పెళ్లి కోరిక తీర‌నుంది. పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి ప్ర‌వేశించ‌నున్నారు. సంసార జీవితాన్ని ఎంజాయ్ చేయ‌నున్నారు. అయితే ఈ నాలుగు రాశుల( Zodiac Signs ) వారికి పెళ్లి ఘ‌డియ‌లు మెండుగా ఉన్నాయ‌ని, క‌చ్చితంగా పెళ్లి అవుతుంద‌ని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. మరి ఆ నాలుగు రాశులేవో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

వృషభ రాశి ( Taurus )

వృష‌భ రాశి వారికి 2026 ఏడాది అద్భుతంగా ఉండ‌నుంది. ఏ ప‌ని చేప‌ట్టినా విజ‌యం సాధిస్తారు. ప‌ట్టింద‌ల్లా బంగార‌మే కానుంది. వివాహ ప్ర‌య‌త్నం కూడా వంద శాతం స‌ఫ‌లీకృతం కానుంది. ఎందుకంటే వృష‌భ రాశి వారి జాత‌కంలో మార్చిలో శుక్రుడు మేష రాశిలోకి సంచారం చేయ‌నున్నాడు. దీంతో ఈ రాశి వారికి శుక్ర గ్ర‌హం చాలా బ‌లంగా ఉండ‌నుంది. దీంతో పెళ్లి క‌ల నెర‌వేర‌నుంది.

సింహ రాశి ( Leo )

సింహ రాశి వారికి కొత్త ఏడాది అద్భుతంగా ఉండ‌నుంది. వివాహ ప్ర‌య‌త్నాలు చేసే వారికి త‌ప్ప‌కుండా పెళ్లి కానుంది. శుక్రుడు అండ‌గా ఉండ‌డంతో చాలా త్వ‌ర‌గా పెళ్ల‌య్యే అవ‌కాశం ఉంది. కొత్త దంప‌తులు నూత‌నోత్సహంతో అనేక విజ‌యాలు సాధించే అవ‌కాశం ఉంద‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

తుల రాశి ( Libra )

2026 ఏడాది తులా రాశి వారికి కూడా అదృష్టాన్ని తీసుకురానుంది. నూత‌న గృహం కొనుగోలు చేసే అవ‌కాశం ఉంది. అదే విధఃగా ఈ రాశి వారి ఏడో ఇంటిలో శుక్రుడు సంచారం కార‌ణంగా కొత్త ఏడాదిలో తెలివైన భాగ‌స్వామిని పెళ్లి చేసుకునే అవ‌కాశం ఉంది. దీంతో కొత్త దంప‌తుల జీవితం ఎలాంటి ఆటంకాలు లేకుండా.. అద్భుతంగా సాగ‌నుంది.

మకర రాశి ( Capricorn )

మకర రాశి వారికి 2026లో అదృష్టం మారిపోతుంది. వీరు చాలా ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా ఎవరికి అయితే చాలా రోజుల నుంచి వివాహం నిశ్చయం కావడం లేదో వారికి అతి త్వరలో పెళ్లి ఫిక్స్ అయ్యి, వివాహం జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంద‌ని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు.

 

Latest News