న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల(Bihar Assembly Elections)లో ఎన్డీఏ కూటమి(NDA leads) విజృంభిస్తుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాల కంటే కూడా ఎక్కువ సీట్లు సాధించే దిశగా ఎన్డీఏ కూటమి దూసుకెలుతూ రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తుంది. అయితే నితీష్ కుమార్ సారధ్యంలోని జేడీయూ అతిపెద్ద పార్టీగా అవతరించవచ్చన్న అంచనాలు కూడా తలకిందులయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఫలితాల ట్రెండ్ చూస్తే మిత్ర పక్షం బీజేపీ ఈ దఫా ఎన్డీఏ కూటమిలో అతిపెద్ద పార్టీగా నిలిచే పరిస్థితి స్పష్టమవుతుంది. ఇప్పటికే మెజార్టీ సీట్ల లెక్కల్లో జేడీయూని బీజేపీ అధిగమించింది.
ఇప్పటికే అందిన సమాచారం మేరకు మొత్తం 243అసెంబ్లీ సీట్లలో ఎన్డీఏ కూటమి 187స్థానాల్లో ఆధిక్యతలో నిలచింది. ప్రతిపక్ష మహాఘట్ బంధన్ 49సీట్లలో ఆధిక్యతలో ఉంది. బీజేపీ 81సీట్లలో, జేడీయూ 75, ఎల్ జేపీ(ఆర్వీ) పార్టీ 17స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఆర్జేడీ 39 సీట్లలో, కాంగ్రెస్ 9 సీట్లలో ఆధిక్యతలో ఉంది. ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ తన నియోజకవర్గంలో గెలుపు కోసం ఎదురీదుతున్నారు. ఎన్‌డీఏ విజయం వెనుక ‘అభివృద్ధి’ వాదన, స్త్రీ ఓటర్లు, వర్గ రాజకీయాలు ముఖ్య పాత్రలు పోషించాయని విశ్లేషకులు చెబుతున్నారు.
