Telangana government Ramzan orders| రంజాన్ వేళ.. ముస్లిం ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

రంజాన్ మాంసం వేళ ముస్లిం మైనార్టీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రంజాన్ నెలలో సాయంత్రం 4 గంటలకే ఆఫీసుల నుంచి వెళ్లేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది.

విధాత, హైదరాబాద్ : రంజాన్ మాంసం వేళ ముస్లిం మైనార్టీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రంజాన్ నెలలో సాయంత్రం 4 గంటలకే ఆఫీసుల నుంచి వెళ్లేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. 2026 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు ముస్లిం ఉద్యోగులకు ఈ ప్రత్యేక సడలింపు అమలులో ఉండనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు.

ముస్లిం మైనార్టీ ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి ఈ మినహాయింపు ఉంటుందని, పబ్లిక్ సెక్టార్, బోర్డులు, కార్పొరేషన్ల ఉద్యోగులకు సైతం మినహాయింపు వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. నమాజ్ నిర్వహణ కోసం ముందుగానే వెళ్లేందుకు ముస్లిం మైనార్టీ ఉద్యోగులకు ఈ అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సేవలు అవసరం ఉన్నచోట మాత్రం హాజరు కావాల్సిందేనన్న ప్రభుత్వం స్పష్టం చేసింది.

Latest News