Site icon vidhaatha

రామాపురం బీచ్‌లో మరో విషాదం.. సముద్రంలో మునిగి ఇద్దరు మృతి

విధాత: ఏపీలోని బాపట్ల జిల్లా వేటపాలెం మండల రామాపురం బీచ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన యువకుల్లో ఇద్దరు నీట మునిగి మృతి చెందారు. మంగళగిరికి చెందిన 12 మంది యువకులు ఆదివారం సముద్ర స్నానానికి రామాపురం బీచ్‌కు వెళ్లారు. వీరంతా స్నానం చేస్తుండగా అలల ఉద్ధృతికి బాలసాయి(26), బాల నాగేశ్వరరావు(27) అనే ఇద్దరు యువకులు నీట మునిగి చనిపోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు ఒక్క రోజు ముందు కూడా రామాపురం బీచ్‌లోనే సముద్ర స్నానానికి వెళ్లి నలుగురు మృతి చెందడం గమనార్హం. ఆ ఘటన మరువకముందే మరో ఇద్దరు యువకులు మృతి చెందడటంతో రామాపురం బీచ్ అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.

Exit mobile version