UPSC | నాన్‌ కేడర్‌ ఐఏఎస్‌ ఇంటర్వ్యూలు జూన్‌ 25కు వాయిదా

ఎన్నికల కోడ్ సమయంలో నాన్‌ ఐఏఎస్‌ల ఎంపిక ఇంటర్వ్యూలు చేయవద్దని, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆ ప్రక్రియ చేపట్టాలని టీడీపీ అధినేత ఎన్‌. చంద్రబాబునాయుడు రాసిన లేఖపై స్పందించిన యూపీఎస్సీ ఇంటర్వ్యూలను జూన్‌ 6వ తేదీ నుంచి 25వ తేదీఇకి వాయిదా వేసింది

  • Publish Date - May 30, 2024 / 03:03 PM IST

చంద్రబాబు ఫిర్యాదుతో యూపీఎస్సీ నిర్ణయం
ఖంగుతున్న ఏపీ సీఎస్‌

విధాత : ఎన్నికల కోడ్ సమయంలో నాన్‌ ఐఏఎస్‌ల ఎంపిక ఇంటర్వ్యూలు చేయవద్దని, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆ ప్రక్రియ చేపట్టాలని టీడీపీ అధినేత ఎన్‌. చంద్రబాబునాయుడు రాసిన లేఖపై స్పందించిన యూపీఎస్సీ ఇంటర్వ్యూలను జూన్‌ 6వ తేదీ నుంచి 25వ తేదీఇకి వాయిదా వేసింది. ఇంటర్వ్యూలను ముందుగానే అంటే మే లోనే ఎన్నికల ఫలితాలు రాకముందే పూర్తి చేయాలని సీఎస్ జవహర్ రెడ్డి యూపీఎస్సీకి లేఖ రాశారు.

ప్రభుత్వం సూచించిన వారినే ఎంపిక చేయించేందుకు సీఎస్ ప్రయత్నాలు చేశారని, తద్వారా కౌంటింగ్‌లో లాభం పొందాలని చూశారని, అదిగాక కోడ్‌ కూడా అమల్లో ఉందని చంద్రబాబు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ యూపీఎస్సీకి లేఖ రాశారు. చంద్రబాబు లేఖపై స్పందించిన యూపీఎస్సీ ఇంటర్వ్యూ తేదీని జూన్ 25కి వాయిదా వేసింది. యూపీఎస్సీ తీసుకున్న ఈ నిర్ణయం సీఎస్‌ సహా అధికార వైసీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బలా తగిలింది.

Latest News