Site icon vidhaatha

కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న వై వి సుబ్బారెడ్డి దంపతులు

విధాత:విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారి గుడికి ఈ రోజు టీటీడీ బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి దంపతులు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.పండితుల ఆశీర్వచనములు తీసుకున్నారు. ఈవో భ్రమరాంబ ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు అమ్మ వారి ప్రసాదం,చిత్రపటం వై వి సుబ్బారెడ్డి దంపతులకు అందజేసినారు. వై వి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అమ్మ వారి ఆశీస్సులతో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రెండోసారి టీటీడీ చైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించినందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేశారు. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆ కనకదుర్గమ్మ తల్లి లు ప్రజలపై ఉండాలని జగన్ మోహన్ రెడ్డి పాలన లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని సకాలంలో ప్రజలకు చేరాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కలియుగ దైవం అయిన వెంకటేశ్వరస్వామిని కోరుకుంటున్నాను అని అన్నారు.

Exit mobile version