Postal Jobs | త‌పాలా శాఖ‌లో 30 వేల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ జారీ.. ప‌రీక్ష లేకుండానే జాబ్..

Postal Jobs విధాత‌: త‌పాలా శాఖ‌లో కొలువుల జాత‌ర కొన‌సాగుతూనే ఉంది. తాజాగా మ‌రో 30 వేలకు పైగా ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో 40 వేల‌కు పైగా పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించిన పోస్ట‌ల్ డిపార్ట్‌మెంట్‌.. మే మాసంలో 12,828 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా వివిధ పోస్ట‌ల్ స‌ర్కిళ్ల‌లో 30,041 గ్రామీణ డాక్ సేవ‌క్(జ‌డీఎస్) పోస్టుల కోసం నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ ఉద్యోగాల కోసం ఆగ‌స్టు […]

  • Publish Date - August 3, 2023 / 10:25 AM IST

Postal Jobs

విధాత‌: త‌పాలా శాఖ‌లో కొలువుల జాత‌ర కొన‌సాగుతూనే ఉంది. తాజాగా మ‌రో 30 వేలకు పైగా ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో 40 వేల‌కు పైగా పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించిన పోస్ట‌ల్ డిపార్ట్‌మెంట్‌.. మే మాసంలో 12,828 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా వివిధ పోస్ట‌ల్ స‌ర్కిళ్ల‌లో 30,041 గ్రామీణ డాక్ సేవ‌క్(జ‌డీఎస్) పోస్టుల కోసం నోటిఫికేష‌న్ జారీ చేసింది.

ఈ ఉద్యోగాల కోసం ఆగ‌స్టు 3 నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ప‌ది పాసైన వారు ఈ నెల 23వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అభ్య‌ర్థుల వ‌య‌సు 18 నుంచి 40 ఏండ్ల మ‌ధ్య‌లో ఉండాలి. ఎస్సీ, ఎస్టీల‌కు ఐదేండ్లు, ఓబీసీల‌కు మూడేండ్లు, దివ్యాంగుల‌కు ప‌దేండ్ల చొప్పున వ‌య‌సులో స‌డ‌లింపు ఇచ్చారు. ఆగ‌స్టు 24 నుంచి 26 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల్లో స‌వ‌ర‌ణ‌ల‌కు అవ‌కాశం క‌ల్పించారు.

మార్కుల ఆధారంగానే ఎంపిక‌.. సైకిల్ తొక్క‌డం రావాలి..

బ్రాంచ్ పోస్టు మాస్ట‌ర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్ట‌ర్, డాక్ సేవ‌క్ పోస్టుల‌కు ఎలాంటి రాత ప‌రీక్ష నిర్వ‌హించ‌రు. టెన్త్‌లో సాధించిన మార్కుల ఆధారంగా నియామ‌కాలు చేప‌ట్ట‌నున్నారు. అభ్య‌ర్థుల‌కు క‌నీసం కంప్యూట‌ర్ జ్ఞానం క‌లిగి ఉండాలి. సైకిల్ తొక్క‌డం కూడా రావాలి.

బ్రాంచ్ పోస్టు మాస్ట‌ర్ ఉద్యోగాల‌కు రూ. 12 వేల నుంచి రూ. 29,380, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్ట‌ర్‌కు రూ. 10 వేల నుంచి రూ. 24,470 వేత‌నం ఇవ్వ‌నున్నారు. 30,041 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ జారీ కాగా, తెలంగాణ‌లో 961, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 1058 ఉద్యోగాల చొప్పున భ‌ర్తీ చేయ‌నున్నారు. ఉద్యోగాల‌కు ఎంపికైన వారు ప‌ని దినాల్లో రోజుకు 4 గంట‌ల చొప్పున ప‌ని చేస్తే స‌రిపోతుంది.

Latest News