Temples in India | భారతదేశం( India ) ఆధ్యాత్మిక దేశంగా వెలుగొందుతోంది. హిందూ దేవాలయాలకు( Hindu Temples ) నిలయంగా మారింది. ప్రపంచ పర్యాటకులు కూడా దేశంలోని హిందూ దేవాలయాలను సందర్శిస్తూ ఆధ్యాత్మిక( Spiritual ) వాతావరణంలో మునిగి తేలుతుంటారు. దేశంలోని ఆలయాలన్నీ మన దేశ సంస్కృతి, చరిత్ర, వాస్తు శిల్ప కళను ప్రపంచానికి చాటి చెబుతున్నాయి. మన దేశ సంస్కృతికి, చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా దేవాలయాలు నిలుస్తున్నాయి.
templesofindia.org ప్రకారం దేశంలో మొత్తం 6,48,907 ఆలయాలు ఉన్నట్లు సమాచారం ఉంది. మరో లక్ష వరకు లెక్కించబడని ఆలయాలు ఉన్నాయని పేర్కొంది. అయితే దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో అత్యధికంగా ఆలయాలు ఉన్నాయి. అత్యల్పంగా మిజోరంలో 32 ఆలయాలు మాత్రమే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 28,312 ఆలయాలు ఉన్నాయి.
టాప్ 10 టెంపుల్ రాష్ట్రాలు ఇవే..
తమిళనాడు – 79,154
మహారాష్ట్ర – 77,283
కర్ణాటక – 61,232
పశ్చిమ బెంగాల్ – 53,658
గుజరాత్ – 49,995
ఆంధ్రప్రదేశ్ – 47,152
రాజస్థాన్ – 39,392
ఉత్తరప్రదేశ్ – 37,518
ఒడిశా – 30,877
బీహార్ – 29,748
అత్యల్పంగా ఆలయాలు ఉన్న రాష్ట్రాలు ఇవే..
మిజోరం – 32
నాగలాండ్ – 43
సిక్కిం – 87
అరుణాచల్ ప్రదేశ్ – 96
మేఘాలయ – 128
