Spirituality | గర్భాలయంలో దేవుడిని దర్శించుకునేటప్పుడు కళ్లు మూయాలా..? వద్దా..?
Spirituality | భక్తిభావం( Devotee ) కలిగిన వారు నిత్యం ఏదో ఒక ఆలయానికి( Temple ) వెళ్తుంటారు. అక్కడ ప్రదక్షిణలు చేసి.. గర్భాలయంలోని దేవుడిని( God ) దర్శించుకుంటుంటారు. అయితే గర్భాలయంలోని దేవుడిని ప్రసన్నం చేసుకునే సమయంలో కొన్ని నియమాలు పాటించాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. లేని యెడల భక్తులు దేవుడిని ఎంత ప్రార్థించినా లాభం లేదని అంటున్నారు.

Spirituality | చాలా మంది భక్తులు( Devotees ) ఆలయాలకు( Temples ) దేవుళ్లను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్తుంటారు. కొందరు ప్రశాంతత కోసం కూడా ఆలయాలకు వెళ్తుంటారు. కాబట్టి.. ఇతర భక్తులకు భంగం కలగకుండా ఆలయంలో మెలగాలి. ఆలయంలోని గంటలను అదేపనిగా మోగించరాదు. ఇక పెద్దగా మాట్లాడరాదు. సెల్‌ఫోన్‌ను సైలెంట్‌లో ఉంచాలి. ఇతర భక్తులను తోసుకుంటూ ముందుకు వెళ్లరాదు. ఓపికగా దైవదర్శనం కోసం వేచి ఉండాలి. ఓపిక ఉన్నప్పుడే దేవాలయాలకు వెళ్లడం మంచిది.
దైవ దర్శన సమయంలో కళ్లు తెరవలా..? వద్దా..?
ఇక ఆలయంలోకి ప్రవేశించగానే.. భక్తులు ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోవాలి. అనంతరం గర్భాలయం వద్దకు వెళ్లాలి. అయితే దేవుడిని దర్శించుకునే సమయంలో దేవుడి విగ్రహానికి ఎదురుగా నిలబడి దర్శించుకోకూడదు. ఒక పక్కకు నిలబడి దేవుడిని దర్శించాలి. అలాగే గర్భాలయంలో విగ్రహాలను దర్శించేటప్పుడు కళ్ళు మూసుకోకూడదు. కళ్ళు తెరచి భగవంతుని స్వరూపాన్ని మనసులో నిలుపుకునేలా దర్శనం చేసుకోవాలి. అప్పుడే దైవదర్శనం ఫలవంతంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.
తీర్థం ఎలా స్వీకరించాలి?
దేవాలయంలో తీర్థం స్వీకరించేటప్పుడు ఎడమ చేతి పైన కుడి చెయ్యి ఉంచి బొటన వేలు, చూపుడు వేలు కలిసేలా ఉండే ముద్రలో ఉంచి తీర్థాన్ని స్వీకరించాలి. తీర్థం స్వీకరించిన తర్వాత ఆ చేతిని తలకు తుడుచుకోకూడదు. జేబు రుమాలుతో చేతిని తుడుచుకోవాలి.
ప్రసాదం ఎలా స్వీకరించాలి?
దేవాలయంలో ప్రసాదం పెడితే భక్తితో కళ్ళకు అద్దుకుని నోట్లో వేసుకోవాలి. ప్రసాదం రుచిగా ఉందని ఎక్కువగా తీసుకుని వృధా చేయకూడదు. దేవుని ప్రసాదం అంటే అది దేవుని అనుగ్రహం! ప్రసాదం నలుగురు తొక్కేలా కింద పోయకూడదు.