Site icon vidhaatha

Breaking: మ‌ద్యం కుంభ‌కోణం.. అభిషేక్ బోయిన‌ప‌ల్లి అరెస్ట్‌

విధాత: ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణంలో అరెస్టుల ప‌ర్వం కొన‌సాగుతున్న‌ది. ఈ కేసులో సీబీఐ మ‌రొక‌రు అరెస్టు అయ్యారు. హైద‌రాబాద్‌కు చెందిన అభిషేక్ బోయిన‌ప‌ల్లిని అరెస్టు చేసిన‌ట్లు సీబీఐ తెలిపింది. ఆయ‌న‌ను కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌నున్న‌ది.

ఈ వ్య‌వ‌హారానికి సంబంధించిన వివ‌రాల‌ను సీబీఐ కేంద్ర కార్యాల‌యం వెల్ల‌డించింది. ఈ కేసులో ఇప్ప‌టివ‌ర‌కు ఇద్ద‌రిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఇప్ప‌టికే సీబీఐ విజ‌య్ నాయ‌ర్‌ను అరెస్టు చేసింది.

ఆయ‌న త‌ర్వాత అభిషేక్ బోయిన‌ప‌ల్లిని అదుపులోకి తీసుకున్న‌ది. ఇదే వ్య‌వ‌హారంలో స‌మీర్ మ‌హేంద్రును ఈడీ అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే.

Exit mobile version