బిగ్ బాస్ హౌస్‌లో మర్డర్ మిస్టరీ కొనసాగుతూనే ఉంది. ప్రశాంత్‌తో పాటు.. అశ్వినిని కూడా మర్డర్ చేసి తప్పించుకుని తిరుగుతున్న శివాజీని పోలీసులు ఇంట్రాగేషన్ చేశారు. మర్డర్ చేసింది ఎవరో చెప్పాలని కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అమర్, అర్జునలని బిగ్ బాస్ ప్రశ్నించారు. దాంతో వారిద్దరు శివాజి పేరు చెప్పారు.అయితే ఆధారం ఏంటని అడగగా, ఆయనచాణుక్యుడిలా ప్లాన్‌లు వేసి ఏమైనా చేయగల సమర్ధుడనే ఉద్దేశంతో అతన్ని జైల్లో వేస్తున్నాం’ అంటూ వారు చెప్పుకొచ్చారు.అయితే మర్డర్ చేసింది శివాజీ అని తెలియడంతో సీక్రెట్ టాస్క్‌లో అతను విఫలం అయినట్టు తెలిపారు బిగ్ బాస్. కాబట్టి.. తరువాత మర్డర్స్‌ని ప్రియాంక చేయాల్సి ఉంటుందని.. దానిలో భాగంగా ఫోన్‌ని ప్రియాంకకి ఇచ్చి.. ఆమె చేయాల్సిన హత్యల గురించి చెప్పాలని చెప్పుకొచ్చారు బిగ్ బాస్.
అయితే అశ్వినిని మర్డర్ చేసేందుకు శివాజీ అద్దంపై పేస్టు తో క్రై బేబీ అశ్విని గెట్ అవుట్ అని రాయాల్సి ఉండగా, ఆ పనిని శివాజీ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసాడు. ఇక గౌతమ్‌ని మర్డర్ చేయమని బిగ్ బాస్ శివాజీకి ఆదేశించగా, అందుకోసం గౌతమ్‌కి స్టికర్ అంటించాలని కోరారు. కానీ ఇచ్చిన టైంలో శివాజీ ఆ పని పూర్తి చేయలేకపోయారు. దీనితో బిగ్ బాస్ శివాజీని తప్పుకోమని చెప్పి.. ఆ పనిని ప్రియాంకకి ఎవరికీ అనుమానం రాకుండా అప్పగించాలని కోరారు. శివాజీ అలాగే చేశాడు. ఇక ప్రియాంక విజయవంతంగా మర్డర్స్ చేయడం మొదలు పెట్టింది.
ముందుగా తన ఫస్ట్ మర్డర్ కోసం తనకి ఇచ్చిన స్టిక్కర్‌ని గౌతమ్‌కి వేయాల్సి ఉండగా.. ఆ టాస్క్‌ని కంప్లీట్ చేసింది ప్రియాంక. దీంతో గౌతమ్ డెడ్ అయ్యాడు. అయితే ప్రియాంక మర్డర్స్ చేస్తున్నప్పటికీ శివాజిపైన అనుమానం రావడంతో ఆయనని జైలులో వేసారు. ఆ తరువాత రిపోర్టర్ శోభాశెట్టి.. జైలు ఊచల్ని దాటుకుని లోపలికి వెళ్లి మరీ శివాజీని ఇంటర్వ్యూ చూస్తుంది. రతిక, శివాజీ, శోభా కామెడీ పండించడంతో సరదాగా సాగింది. జైల్లో వేసినా కూడా శివాజీ తాను హత్యలు చేయలేదనే అందర్నీ నమ్మిస్తున్నాడు.మొత్తానికి తాజా ఎపిసోడ్ అలా ఫన్నీ ఫన్నీగా సాగింది.