Paddy Bonus 2026 | రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. బోనస్ రూ.514.36కోట్లు విడుదల

తెలంగాణ రైతులకు శుభవార్త. ఖరీఫ్ సన్న ధాన్యంపై రూ.514.36 కోట్లు బోనస్ విడుదల. క్వింటల్‌కు రూ.500 చొప్పున డీబీటీ ద్వారా రైతుల ఖాతాల్లో జమ.

Paddy Bonus 2026

విధాత, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఖరీఫ్ సన్న ధాన్యంకు సంబంధించి పెండింగ్ లో ఉన్న బోనస్ బకాయిలను క్లియర్ చేస్తూ రూ.514.36 కోట్ల నిధులను విడుదల చేసింది. క్వింటల్‌కు రూ.500 చొప్పున బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో నేరుగా ‘డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్’ (DBT) పద్ధతిలో జమ చేయనున్నారు. దీని ద్వారా సుమారు 2.17 లక్షల మంది రైతులు నేరుగా లబ్ధి పొందనున్నారు.

ఇప్పటి వరకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.1939.58 కోట్ల బోనస్ ను సన్న ధాన్యం రైతులకు చెల్లించింది. రాష్ట్రంలో సన్న బియ్యం సాగును ప్రోత్సహించడం, రైతులకు మెరుగైన గిట్టుబాటు ధర అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు. బోనస్ డబ్బుల జమాపై రైతులు తమ బ్యాంక్ ఖాతాలను చెక్ చేసుకోవాలని, ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత కొనుగోలు కేంద్రాలు, సివిల్ సప్లైస్ శాఖను సంప్రదించాలని అధికారులు సూచించారు. పెండింగ్ బకాయిలు విడుదలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Crocodile Attack : మహిళను చంపేసిన మొసలి..వీడియో వైరల్
Naga Babu | మేడారం జాతరలో చిరు వ్యాపారిపై వేధింపులు .. వలీకి ఎమ్మెల్సీ నాగబాబు ఆర్థిక సహాయం

Latest News