Site icon vidhaatha

న‌వంబ‌ర్‌10లోపు మునుగోడు ఎన్నిక‌?

విధాత‌, హైద‌రాబాద్‌: మునుగోడు శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక నవంబ‌ర్‌ మొద‌టి వారంలో హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌తో పాటు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు 2017లో నవంబ‌రు 9న జ‌రిగాయి.

హిమాచ‌ల్ శాస‌న‌స‌భ గ‌డువు జ‌న‌వ‌రి, 2023 మొద‌టివారంలో ముగుస్తుంది. గుజ‌రాత్ శాస‌న‌స‌భ గ‌డువు ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో ముగుస్తుంది. ఉప ఎన్నిక‌లు, రెండు రాష్ట్రాల ఎన్నిక‌లు విడివిడిగా పెడ‌తారా క‌లిపి పెడ‌తారా అన్న అంశంపై ఎన్నిక‌ల సంఘం ఇంకా స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు.

పాత‌ప‌ద్ధ‌తి ప్ర‌కారం ఎన్నిక‌లు పెడితే హిమాచ‌ల్ ఎన్నిక‌లు ముందుగా వ‌స్తాయి. ఆ ఎన్నిక‌తోపాటే ఉప ఎన్నిక‌లు నిర్వ‌హిస్తారు. అంటే మ‌రో రెండు మాసాల వ్య‌వ‌ధిలో ఉప ఎన్నిక‌లు ముగుస్తాయి.

2017లో గుజ‌రాత్ పోలింగ్ ముగియ‌డం కోసం హిమాచ‌ల్ ఓట్ల‌ను నెల‌ రోజులు లెక్కించ‌కుండా ఉంచారు. విడివిడిగా ఎన్నిక‌లు జ‌రిగితే ఈసారి కూడా అలాగే లెక్కింపు, ఫ‌లితాల‌ కోసం వేచి ఉండాల్సి రావ‌చ్చు.

Exit mobile version