చిరంజీవి స్పూర్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ ఆనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఆయనకి పుష్ప సినిమాతో క్రేజ్ అమాంతం పెరిగింది. పుష్ప సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న బన్నీ పుష్ప2 చిత్రంతో విధ్వంసం సృష్టించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాతో ఆయనకి ఆస్కార్ అవార్డ్ రావడం కూడా గ్యారెంటీ అని కొందరు ముచ్చటించుకుంటున్నారు. ప్రస్తుతం అయితే పుష్ప 2 చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సుకుమార్ మొదటి పార్ట్‌ని మించి రెండో పార్ట్‌ని చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు.
అయితే పుష్ప 2 చిత్రం వచ్చే ఏడాది ఆగస్ట్‌లో రిలీజ్ కానుందని తెలుస్తుండగా, ఈ సినిమాతో తెలుగువాడు మరింత గర్వపడేలా చేస్తాడని అంటున్నారు. అయితే తాజాగా అల్లు అర్జున్ కు సబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బన్నీ బ్యాచిలర్ గా ఉన్నప్పుడు చాలా కోపంగా ఉండేవాడట. ఎవరితోనైన కాస్త ఘాటుగా మాట్లాడేవాడట. అందులో బూతులు కూడా ఎక్కువ వాడేవాడట. ఆతరువాత తనను తాను మార్చుకున్నాడని అంటున్నారు. పెళ్ళి తరువాత బన్నీలో చాలా మార్పు వచ్చిందని ఆయన దగ్గరి వారు అంటున్నారు. స్నేహారెడ్డితో ప్రేమలో పడ్డప్పుడు బన్నీ చాలా మారిపోయాడని టాక్.
అయాన్ , అర్హ ఫుట్టిన తరువాత బన్నీ కంప్లీట్ గా మారిపోయి చాలా శాంతంగా ఉంటున్నాడట. కోపం కంప్లీట్ గా తగ్గించుకొని చాలా ఓపిక తెచ్చుకున్నాడట. బూతులు మాట్లాడటం మర్చిపోయారట అల్లు అర్జున్. అల్లు అర్జున్ తన లైఫ్ స్టైల్ ను పెళ్లి పిల్లల తరువాత కంప్లీట్ గా మార్చుకోవడం చూసి అందరు షాక్ అవుతున్నారు. పుష్ప తరువాత అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నాడు. అలానే బాలీవుడ్ డైరెక్టర్‌తో కూడా సినిమా చేయనున్నట్టు తెలుస్తుంది. చూస్తుంటే అల్లు అర్జున్ క్రేజ్ రోజురోజుకి మరింత పెరగుతూ పోతుండడం ఆయన అభిమానులకి ఆనందాన్ని కలిగిస్తుంది.