Breaking | RBI : రూ. 2 వేల నోట్లు రద్దు

ఈనెల 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు మార్చుకునే అవకాశం కీలక నిర్ణయం తీసుకున్న రిజర్వ్ బ్యాంక్ విధాత: దేశంలో చెలామణిలో ఉన్న రూ. 2 వేల నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఉపసంహరించుకున్నది. ఈ మేరకు శుక్రవారం ఆర్బీఐ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. క్లీన్ నోట్ల పాలసీలో భాగంగా రూ. 2 వేలనోట్ల చెలామణిని ఉపసంహరించుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ₹2000 Denomination Banknotes – Withdrawal from Circulation; Will continue as Legal Tenderhttps://t.co/2jjqSeDkSk — […]

  • Publish Date - May 19, 2023 / 01:54 PM IST

  • ఈనెల 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు మార్చుకునే అవకాశం
  • కీలక నిర్ణయం తీసుకున్న రిజర్వ్ బ్యాంక్

విధాత: దేశంలో చెలామణిలో ఉన్న రూ. 2 వేల నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఉపసంహరించుకున్నది. ఈ మేరకు శుక్రవారం ఆర్బీఐ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. క్లీన్ నోట్ల పాలసీలో భాగంగా రూ. 2 వేలనోట్ల చెలామణిని ఉపసంహరించుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది.

ఈనోట్లను సర్కులేషన్లో ఉంచ వద్దని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. రెండు వేల రూపాయల నోట్లను ఈ నెల23వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు బ్యాంకులు, ఆర్బీఐ కార్యాలయాల్లో మార్చుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఈమేరకు ఒక్కొక్కరు ఒక్క విడతలో రూ. 20 వేలు మాత్రమే మార్చుకోవాలని తెలిపింది.

నోట్ల రద్దు తరువాత 10నవంబర్ 2016 నుంచి రూ. 2 వేల నోట్లను చెలామణిలోకి తీసుకువచ్చిన కేంద్రం 2018 నుంచి వీటి ముద్రను నిలిపి వేసింది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 3.5 లక్షల కోట్ల రెండు వేల రూపాయల నోట్లు చెలామణిలో ఉన్నాయని తెలిపింది.

Latest News