Site icon vidhaatha

RBI | 2000 నోట్లు 75% వాపస్‌.. ఎక్కువగా డిపాజిట్ల రూపంలోనే!

RBI

ముంబై: ఇప్పటి వరకు 75% 2000 రూపాయల నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయని, అందులో ఎక్కువగా డిపాజిట్ల రూపంలో వచ్చాయని భారతీయ రిజర్వు బ్యాంకు సోమవారం వెల్లడించింది.

రెండు వేల రూపాయల నోట్లను సెప్టెంబర్‌ 30లోగా బ్యాంకులలో డిపాజిట్‌ చేయడమో, మార్చుకోవడమో చేయాలని రిజర్వు బ్యాంకు ఆదేశించిన విషయం విదితమే.

రెండు వేల నోటు ఉపసంహరణ ప్రకటన చేసిన మే 19 నాటి నుంచి జూన్‌ ౩౦ నాటివరకు బ్యాంకులకు వచ్చిన నోట్ల విలువ 2.72 లక్షల కోట్ల రూపాయలని రిజర్వు బ్యాంకు పేర్కొంది.

జూన్‌ 30 నాటికి ఇంకా 0.84 లక్షల కోట్ల విలువ చేసే నోట్లు మార్కెట్‌లో ఇంకా చెలామణిలో ఉన్నాయని బ్యాంకు వివరించింది.

తిరిగి వచ్చిన నోట్లలో 87 శాతం బ్యాంకు డిపాజిట్ల రూపంలో రాగా, 13 శాతం నోట్ల మార్పు రూపంలో వచ్చాయని రిజర్వు బ్యాంకు ప్రకటన పేర్కొంది

Exit mobile version