ఏప్రిల్ 1న రూ. 2 వేల నోట్ల మార్పిడి బంద్.. ఎందుకంటే..?

మరో రెండు రోజుల్లో ఆర్థిక సంవ‌త్స‌రం ముగుస్తున్న నేప‌థ్యంలో రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1వ తేదీన రూ. 2 వేల నోట్ల‌ను మార్చుకోవ‌డం లేదా డిపాజిట్ చేయ‌డానికి వీలు లేద‌ని ఆర్బీఐ ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.

  • Publish Date - March 29, 2024 / 04:01 AM IST

మరో రెండు రోజుల్లో ఆర్థిక సంవ‌త్స‌రం ముగుస్తున్న నేప‌థ్యంలో రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1వ తేదీన రూ. 2 వేల నోట్ల‌ను మార్చుకోవ‌డం లేదా డిపాజిట్ చేయ‌డానికి వీలు లేద‌ని ఆర్బీఐ ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. దేశ వ్యాప్తంగా మొత్తం 19 ఆర్బీఐ కార్యాల‌యాల్లో ఈ ఉత్త‌ర్వులు అమ‌లవుతాయ‌ని స్ప‌ష్టం చేసింది. అహ్మ‌దాబాద్, బెంగ‌ళూరు, బేలాపూర్, భోపాల్, భువ‌నేశ్వ‌ర్, చండీఘ‌ర్, చెన్నై, గువ‌హ‌టి, హైద‌రాబాద్, జైపూర్, జ‌మ్మూ, కాన్పూర్, కోల్‌క‌తా, ల‌క్నో, ముంబై, నాగ్‌పూర్‌, న్యూఢిల్లీ, పాట్నా, తిరువ‌నంత‌పురం ఆర్బీఐ కార్యాల‌యాల్లో ఈ ఉత్త‌ర్వులు అమ‌లు కానున్నాయి.

ఏప్రిల్ 2వ తేదీ నుంచి మ‌ళ్లీ రూ. 2 వేల నోట్ల‌ను మార్పిడి లేదా డిపాజిట్ చేసుకోవ‌చ్చ‌ని ఆర్బీఐ పేర్కొంది. గ‌తేడాది రూ. 2 వేల నోట్ల‌ను ఉప‌సంహ‌రించిన సంగ‌తి తెలిసిందే. గ‌తేడాది అక్టోబ‌ర్ నుంచి ఖాతాదారులు రూ. 2 వేల నోట్ల‌ను వారి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసేందుకు ఆర్బీఐ వెసులుబాటు క‌ల్పించింది. 2023, మే 19 నాటికి చ‌లామ‌ణిలో ఉన్న రూ. 2000 క‌రెన్సీ నోట్ల‌లో 2024 మార్చి 1 నాటికి 97.62 శాతం బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌కు తిరిగి వ‌చ్చాయి. 

Latest News