2K Notes Deadline | రూ.2వేల నోట్లు ఇంకా ఉన్నాయా..? నేటితో ముగియనున్న గడువు..!

2K Notes Deadline | చలామణిలో ఉన్న రూ.2వేల నోట్లను భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. మే 19 నుంచి చలామణి నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించగా.. ఆయా నోట్లను మార్చుకునేందుకు, డిపాజిట్‌ చేసుకుందేకు నాలుగు నెలల గడువు ఇచ్చింది. ఈ డెడ్‌లైన్‌ నేటి (సెప్టెంబర్‌ 30)తో ముగియనున్నది. అయితే, ఇప్పటికే 93శాతం నోట్లు తిరిగి బ్యాంకులకు చేరాయని ఆర్‌బీఐ ఈ నెల 2న ప్రకటించింది. ఉపసంహరించుకున్న డినామినేషన్‌లో రూ.2వేల నోట్లు దాదాపు […]

2K Notes Deadline | చలామణిలో ఉన్న రూ.2వేల నోట్లను భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. మే 19 నుంచి చలామణి నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించగా.. ఆయా నోట్లను మార్చుకునేందుకు, డిపాజిట్‌ చేసుకుందేకు నాలుగు నెలల గడువు ఇచ్చింది. ఈ డెడ్‌లైన్‌ నేటి (సెప్టెంబర్‌ 30)తో ముగియనున్నది.



అయితే, ఇప్పటికే 93శాతం నోట్లు తిరిగి బ్యాంకులకు చేరాయని ఆర్‌బీఐ ఈ నెల 2న ప్రకటించింది. ఉపసంహరించుకున్న డినామినేషన్‌లో రూ.2వేల నోట్లు దాదాపు 87శాతం డిపాజిట్లు.. మిగతా 13శాతం మార్పుచున్నట్లు పేర్కొంది. నేటితో గడువు ముగియనున్న నేపథ్యంలో.. మరో నెల రోజులు గడువును పొడిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.



2K Notes Deadline | Are there still Rs 2000 notes? The deadline will end today..!మరికొన్ని నోట్లు బ్యాంకులకు పూర్తిగా తిరిగి రావాల్సి ఉందని.. దీంతో గడువు పొడిగింపుపై ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఎన్నారైలతో పాటు వ్యాపారవర్గాలు తమ వద్ద ఉన్న రూ.2వేల నోట్లను బ్యాంకుల్లో జమ చేయలేదని, ఈ నేపథ్యంలో గడువును పొడిగించాలని ఆర్‌బీఐ భావిస్తున్నది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో మార్పు చేసుకునేందుకు వీలుగా అక్టోబర్‌ 31 వరకు గడువును పొడిగించాలని ఆలోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.