2000 Notes | రెండు వేల నోట్లు.. ఎన్ని వాపస్‌ వచ్చాయంటే..

2000 Notes | లెక్కలు వెల్లడించిన రిజర్వ్‌ బ్యాంక్‌ 93% నోట్లు డిపాజిట్‌ అయినట్టు ప్రకటన వాటి విలువ రూ.3.32 లక్షల కోట్లు న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు సందర్భంగా తాకిడిని తట్టుకునేందుకు ఆర్బీఐ రూ.2000 ముఖ విలువ కలిగిన కరెన్సీ నోట్లను చలామణిలోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఉన్నట్టుండి ఈ ఏడాది మే నెలలో రూ.2000 నోటును ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించింది. ఎవరి దగ్గరైనా ఈ నోట్లు ఉంటే బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసుకోవాలని ఆనాడు సూచించింది. […]

  • By: krs    latest    Sep 02, 2023 12:03 AM IST
2000 Notes | రెండు వేల నోట్లు.. ఎన్ని వాపస్‌ వచ్చాయంటే..

2000 Notes |

  • లెక్కలు వెల్లడించిన రిజర్వ్‌ బ్యాంక్‌
  • 93% నోట్లు డిపాజిట్‌ అయినట్టు ప్రకటన
  • వాటి విలువ రూ.3.32 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు సందర్భంగా తాకిడిని తట్టుకునేందుకు ఆర్బీఐ రూ.2000 ముఖ విలువ కలిగిన కరెన్సీ నోట్లను చలామణిలోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఉన్నట్టుండి ఈ ఏడాది మే నెలలో రూ.2000 నోటును ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించింది. ఎవరి దగ్గరైనా ఈ నోట్లు ఉంటే బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసుకోవాలని ఆనాడు సూచించింది. అందుకు సెప్టెంబర్‌ 30 వరకు గడువు ఇచ్చింది. అంటే ఇంకా ఒక నెల రోజుల సమయం ఉన్నది.

ఈ లోపు అనేక మంది తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డిపాజిట్‌ చేశారు. అయితే.. ఆగస్ట్‌ 31వ తేదీ నాటికి దేశంలోని అన్ని బ్యాంకుల్లో రూ.3.32 లక్షల కోట్ల విలువ చేసే రూ.2000 నోట్లు డిపాజిట్‌ అయినట్టు ఆర్‌బీఐ శుక్రవారం వెల్లడించింది. అంటే.. మార్కెట్‌లో చలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 93శాతం బ్యాంకులకు తిరిగి వచ్చాయని తెలిపింది.

అంటే.. ప్రస్తుతం ఇంకా రూ.0.24 లక్షల కోట్ల విలువైన రెండువేల నోట్లు మార్కెట్‌లోనే ఉన్నాయి. వీటిని డిపాజిట్‌ చేసేందుకు నెల వ్యవధి ఉన్నది. తిరిగి వచ్చిన నోట్లలో 87శాతం.. డిపాజిట్‌ అవగా.. మిగిలినవాటిని వినియోగదారులు ఇతర డినామినేషన్లతో మార్చుకున్నారు.

ఇంకా ఆ నోట్లు కలిగి ఉన్నవారు ఈ నెలాఖరుకల్లా డిపాజిట్‌ చేయాలని ఆర్బీఐ కోరింది. లేదంటే ఆ తర్వాత ఆ నోట్లు ఎందుకూ పనికిరావు. ఆర్బీఐ చేసిన పనితో బ్యాంకులు కూడా కొంత లాభపడ్డాయి. చాలామంది బ్యాంకులకు ఉన్న బకాయిలను రూ.2000 నోట్ల డినామినేషన్‌లో తిరిగి చెల్లించారు.