RBI | రూ.2వేల నోట్ల రద్దుపై.. ఆర్‌బీఐ మరోసారి కీలక ప్రకటన..!
RBI | రూ.2వేల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 23 నుంచి రూ.2వేల నోట్లను ఏ బ్యాంకుల్లోనైనా మార్చుకోవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది. కౌంటర్‌లో రూ.2వేల నోట్లను మార్చుకునే సదుపాయం సాధారణ పద్ధతిలో ప్రజలకు అందించనున్నట్లు పేర్కొంది. నోట్లను ఇతర డినామినేష్లను నోట్లలోకి మార్చుకునేందుకు ఈ నెల 23 నుంచి ఏ బ్యాంకులోనైనా అవకాశం ఉంటుందని.. ఒకేసారి రూ.20వేల వరకు ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చని ఆర్‌బీఐ […]

RBI | రూ.2వేల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 23 నుంచి రూ.2వేల నోట్లను ఏ బ్యాంకుల్లోనైనా మార్చుకోవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది. కౌంటర్‌లో రూ.2వేల నోట్లను మార్చుకునే సదుపాయం సాధారణ పద్ధతిలో ప్రజలకు అందించనున్నట్లు పేర్కొంది. నోట్లను ఇతర డినామినేష్లను నోట్లలోకి మార్చుకునేందుకు ఈ నెల 23 నుంచి ఏ బ్యాంకులోనైనా అవకాశం ఉంటుందని.. ఒకేసారి రూ.20వేల వరకు ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చని ఆర్‌బీఐ చెప్పింది.
ప్రస్తుతం రూ.2వేల నోటు ఇప్పటికీ లీగల్ టెండర్‌గా కొనసాగుతుందని.. అంటేనే ఎక్కడైనా ఈ నోటును వినియోగించి లావాదేవీలు జరపవచ్చని భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. నోట్ల మార్పిడికి నాలుగు నెలల సమయం ఉందని, క్లీన్ నోట్ పాలసీ కింద రూ.2వేల నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
రూ.2000 నోట్లను మార్చుకునేందుకు పూర్తి సన్నాహాలు చేసినట్లు ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. మే 23 నుంచి ఏ బ్యాంకులోనైనా రూ.2000 నోట్లను ఇతర డినామినేషన్లకు మార్చుకునే పరిమితి ఒకేసారి రూ.20,000 వరకు ఉంటుందని, నోట్ల మార్పిడిలో ఎదురవుతున్న ఇబ్బందులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఆయన వివరించారు.
నోట్ల మార్పిడికి ప్రజలు ఇబ్బంది పడవద్దని ఆర్బీఐ గవర్నర్ విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 30 వరకు రూ.2000 నోట్లతో లావాదేవీలు జరపవచ్చని, రూ.2వేల నోట్ల ముద్రణ నిలిపివేసినట్లు శక్తికాంత దాస్ వివరించారు. నాలుగు నెలల సమయం ఇచ్చామని, తొందరపడాల్సిన అవసరం లేదని, కాబట్టి హాయిగా బ్యాంకుకు వెళ్లి రూ.2000 నోట్లను మార్చుకోవచ్చని ఆర్‌బీఐ గవర్నర్ తెలిపారు.
రూ.500, రూ.1000 నోట్ల రద్దు సమయంలో కరెన్సీ కొరతను తీర్చేందుకు రూ.2000 నోట్లను ముద్రించాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. ఇప్పుడు ఈ లక్ష్యం నెరవేరిందన్నా రు. రూ.2000 నోట్ల చలామణి కూడా మనం చెప్పినట్లు గరిష్ట స్థాయి రూ.6.73లక్షల కోట్ల నుంచి దాదాపు రూ.3.62 లక్షల కోట్లకు పడిపోయిందని, ప్రింటింగ్ కూడా నిలిచిపోయింది.