Horoscope | గురువారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి ఆదాయానికి మించిన ఖ‌ర్చులు..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • By: raj |    devotional |    Published on : Mar 05, 2026 7:46 AM IST
Horoscope | గురువారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి ఆదాయానికి మించిన ఖ‌ర్చులు..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు చేపట్టడానికి అనువైన సమయం. ప్రారంభించిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. ఆర్థికంగా ఎంతో బాగుంటుంది. ఆదాయ వనరులు విస్తరిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతుల సూచన ఉంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. నూతన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. మీడియా, కమ్యూనికేషన్ రంగాల వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మీ ప్రతిభకు గుర్తింపు పొందుతారు.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు విషయంలో అనిశ్చితి, సందిగ్ధత నెలకొంటుంది. వృత్తి ఉద్యోగాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరితోనూ వాదనల్లోకి దిగవద్దు. కుటుంబ సభ్యులతోనూ పెద్దలతోనూ స్థిరాస్తులు, వారసత్వపు ఆస్తుల గురించిన చర్చ వాయిదా వెయ్యండి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కీర్తిప్రతిష్ఠలకు భంగం వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుటుంబ కలహాలు అశాంతి కలిగిస్తాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో తరచూ ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో ఆత్మీయుల సహకారం ఆనందం కలిగిస్తుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.

కన్య (Virgo)

కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు ఈ రోజు చాలా మంచి రోజు. వ్యూహాత్మక నిర్ణయాలు అమలు చేసి అధిక లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. స్నేహితులతో, ప్రియమైనవారితో సరదాగా గడుపుతారు. వృత్తిపరమైన ప్రయాణాలు అనుకూలిస్తాయి.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఉద్యోగంలో బాధ్యతగా నడుచుకోవాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగ్గించుకుంటే మంచిది. మొహమాటంతో ఇబ్బందులు పడతారు. డబ్బు తెలివిగా ఖర్చు చేయాలి. కుటుంబ వాతావరణం ఉద్రిక్తంగా ఉంటుంది. కోపావేశాలు నియంత్రించుకోండి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా అలోచించి మాట్లాడాలి.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మీ జీవితంలో సానుకూల మార్పులు జరుగుతాయి. వృత్తి పరంగా స్థిరమైన నిర్ణయాలు మేలు చేస్తాయి. సంపాదన పెరగడంతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుంది. మీ చిరకాల ఆశయాలు నెరవేరుతాయి. ఉద్యోగంలో ప్రశంసలు, గౌరవం లభిస్తాయి. ఒక శుభవార్త ఆనందం కలిగిస్తుంది.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శుభవార్తలు వింటారు. కీలక సమావేశాలు, చర్చల్లో మీదే తుది నిర్ణయం అవుతుంది. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి అనువైన సమయం. ఆర్థిక వ్యవహారాలు ప్రయోజనకరంగా ఉంటాయి. మీ ప్రతిభకు తగిన గౌరవం లభిస్తుంది. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి అనువైన సమయం. ఆర్థికంగా విశేషమైన అభివృద్ధి ఉంటుంది. రావాల్సిన బకాయిలు వసూలవుతాయి. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్నిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట ఆనందం నింపుతుంది.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు ప్రశాంతంగా గడిచిపోతుంది. దైవబలంతో ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారరంగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఒక సంఘటన మనశ్శాంతి కలిగిస్తుంది. ఆర్థికంగా కలిసివచ్చే కాలం. మీరు చేసే ప్రతి ప్రయత్నం ధనలాభాన్ని కలిగిస్తుంది.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించే పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. చంచల బుద్ధి ఇబ్బందులకు దారితీస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఏకాగ్రత, శ్రద్ధ తగ్గకుండా చూసుకోండి. ఆర్థిక సమస్యలు రాకుండా డబ్బు పొదుపుగా ఖర్చు చేయండి. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది.