న్యూజిలాండ్‌లో తీవ్ర భూకంపం సంభవించింది. న్యూజిలాండ్ నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం..రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.3గా నమోదైంది. టె అనావ్ పట్టణానికి ఉత్తరంగా 40 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఫియోర్డ్‌ల్యాండ్ (Fiordland)కు వెళ్లే ప్రధాన ప్రవేశ ద్వారం టే అనౌ కావడం గమనార్హం.
భూకంపం నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా భూగర్భ పరిశోధనా సంస్థ (USGS), జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) మాత్రం ఈ భూకంప తీవ్రతను 5.9గా నమోదు చేశాయి.
మరిన్ని చదవండి :