World Tsunami Awarness Day | సునామీ అంటే ఏంటి?.. ఎలా వస్తుందో తెలుసా?

సునామీని సాధారణంగా జలాంతర్గామి భూకంపం అంటారు. నీటి అడుగున లేదా తీరప్రాంత కొండచరియలు విరిగిపడటం లేదాఅగ్నిపర్వత విస్ఫోటనం వల్ల సంభవించే విపత్తు సముద్ర అలనే సునామీగా పిలుస్తారు. సునామీ అనేది జపనీస్ పదం.

World Tsunami Awarness Day | సునామీ అంటే ఏంటి?.. ఎలా వస్తుందో తెలుసా?

సునామీని సాధారణంగా జలాంతర్గామి భూకంపం అంటారు. నీటి అడుగున లేదా తీరప్రాంత కొండచరియలు విరిగిపడటం లేదాఅగ్నిపర్వత విస్ఫోటనం వల్ల సంభవించే విపత్తు సముద్ర అలనే సునామీగా పిలుస్తారు. సునామీ అనేది జపనీస్ పదం. దీనికి జపనీస్ భాషలో హర్బర్ వేవ్ అని అర్ధం. సునామీ వచ్చినప్పుడు గంటకు 800 కిలోమీటర్ల వేగంతో అలలు ప్రయాణీస్తాయి. తీర ప్రాంతాల వద్ద గరిష్టంగా వంద అడుగులు లేదా 30 మీటర్ల ఎత్తుకు అలలు చేరుకుంంటాయి. అయితే సునామీలు సంభవించడానికి అలలతో సంబంధం లేదు.

సునామీ ఎలా వస్తుంది?

భూకంపాలు, అగ్ని పర్వత విస్పోటనాలు మొదలైన వాటి కారణంగా సముద్రం పెద్దగా, ఆకస్మాత్తుగా స్థానభ్రంశం చెందడం వల్ల ఏర్పడే చాలా పొడవైన తరంగదైర్ఘ్యాల నీటి శ్రేణిని సునామీ అని పిలుస్తారు. వీటిని భూకంప సముద్ర తరంగాలు అని కూడా పిలుస్తారు. ఇవి అత్యంత శక్తివంతమైనవి, విధ్వంసకరమైనవి కూడా. సముద్రంలోపల కానీ బయట కానీ భూకంపాలు వచ్చినప్పుడు, అగ్ని పర్వతాలు బద్దలైన సమయంలో , భూ ఫలకలు జారడం, అతి పెద్ద గ్రహ శకలం ఢీ కొట్టడం, అణ్వాయుధ ప్రయోగాలు సునామీకి కారణం అవుతాయి. ఎక్కువ శక్తికి నీరు కూడా తోడు కావడంతో సునామీలు మహావిధ్వంసాలకు దారి తీస్తాయి. తీర ప్రాంతాల్లో వరదలకు, శక్తివంతమైన ప్రవాహలకు కారణం అవుతాయి. భూమిపై అత్యంత అరుదుగా సంభవించే ప్రమాదాల్లో సునామీ ఒకటి. సాధారణంగా సునామీ నిలువు స్థానభ్రంశంతో ఏర్పడుతుంది. సముద్ర కందకాల వెంట ఉన్న పలకల సబ్‌డక్షన్ సరిహద్దుల వెంట సంభవించే భూకంపాల వల్ల చాలా సునామీలు సంభవిస్తాయి. 1940, 1950లలో మార్షల్ ద్వీపంలో అమెరికా నిర్వహించిన అణు పరీక్ష సునామీకి దారితీసింది. తీర ప్రాంత జలాల వెంట సంభవించే అగ్ని పర్వతాలు సునామీకి కారణం అవుతాయి. భూకంపం, అగ్ని పర్వత విస్పోటనాలు సాధారణంగా కొండచరియలు విరిగిపడేందుకు కారణం అవుతాయి. ఈ కొండచరియలు మహసముద్రాలు, సరస్సుల్లో పడినప్పుడు సునామీ వచ్చే అవకాశం ఉంది. ఉల్క ఢీకొన్న సమయంలో కూడా సునామీ వచ్చే అవకాశం ఉందని చెబుతారు.

సునామీతో విధ్వంసమేనా?

అలలు ఒడ్డుకు చేరుకునే ముందు తీర ప్రాంత నీరు వెనక్కి తగ్గడం సునామీ వస్తున్నందనేందుకు స్పష్టమైన సంకేతం. సునామీతో తీరప్రాంతంలో వరదలు వస్తాయి. అవి తీరప్రాంత నిర్మాణాల పునాదులను కూడా క్షీణింపజేస్తాయి. . అప్పుడు అలలు 5 నుండి 40 నిమిషాల మధ్య భూమిని తాకుతాయి. సునామీ సాధారణ అలల వలె ఆగిపోదు. ఇది సాధ్యమైనంత వరకు భూమి వరకు ప్రయాణిస్తూనే ఉంటుంది. ఇది లోతట్టు ప్రాంతంలో 1 కి.మీ వరకు ఉంటుంది. లోతైన నీటిలో, సునామీ చాలా పొడవైన తరంగదైర్ఘ్యాలను కలిగి ఉంటుంది . సునామీలు ఆఫ్‌షోర్‌లో తక్కువ తరంగ ఎత్తును కలిగి ఉంటాయి. ఇది కొన్ని సెంటీమీటర్ల నుండి 30 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. అయితే చాలా సునామీలు 3 మీటర్ల కంటే తక్కువ తరంగ ఎత్తును కలిగి ఉంటాయి.అది పుట్టిన స్థానం నుండి అన్ని దిశలలో ప్రయాణీస్తుంది. మొత్తం సముద్రాన్ని కప్పేస్తుంది.ఇది సాధారణంగా నిమిషాల నుండి గంటల వరకు ఉండే కాల వ్యవధులతో కూడిన తరంగాల శ్రేణిని కలిగి ఉంటుంది.ఇవి భూకంపాల వల్ల కాదు, ప్రకంపనల వల్ల ఉత్పన్నమయ్యే అలలు. సునామీలకు సీజన్ ఉండదు. అన్ని సునామీలు ఒకేలా ఉండవు. అది ఎక్కడ, ఎప్పుడు, ఎంత విధ్వంసం కలిగిస్తుందో ఊహించలేము. ఒకే చోట వచ్చే చిన్న సునామీ కొన్ని మైళ్ల దూరంలో చాలా పెద్దదిగా ఉండవచ్చు.ఒక సునామీ తీరప్రాంతాలను భిన్నంగా ప్రభావితం చేయవచ్చు. ఏ సమయంలోనైనా సునామీ ఏ సముద్ర తీరాన్ని అయినా తాకవచ్చు. అవి తీరప్రాంతాలకు పెద్ద ముప్పును కలిగిస్తాయి. భూకంప కేంద్రం సముద్ర జలాల కంటే తక్కువగా ఉండి, తీవ్రత తగినంత ఎక్కువగా ఉంటేనే సునామీ ప్రభావం ఏర్పడుతుంది. సాధారణంగా అకస్మాత్తుగా తగ్గుతూ, తరువాత వేగంగా పెరుగుతున్న నీటి మట్టాల రూపంలో సునామీ వస్తోంది. దీంతో వరదలు సంభవిస్తాయి. సునామీతో అధిక వేగంతో ప్రయాణించే నీటికి శక్తి ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు సునామీ సమయంలో వచ్చే అలలు పెద్దగా కనిపించకపోయినా పెద్ద పరిమాణంలో నీటిని భూమి నుంచి బయటకు తీసుకువెళ్తాయి. దీంతో ఈ నీటిలో అన్ని కొట్టుకుపోతాయి. లోతైన సముద్రంలో 30 సెంటిమీట్ల ఎత్తులో ఉన్న ఒక చిన్న అల తీరం మీదుగా దూసుకుపోతున్నప్పుడు 30 మీటర్ల ఎత్తులో ఉన్న రాకాసి అలగా మారవచ్చు. పెద్ద సునామీలు వచ్చినప్పుడు ఇవి 100 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుకు ఎగిరే అవకాశం ఉంది. సునామీ అలలు తన మార్గంలో అడ్డుగా ఉన్న వాటిని నాశనం చేస్తాయి.

విధ్వంసం సృష్టించిన సునామీలు ఇవే…

పోర్చుగల్ లో 1755లో వచ్చిన సునామీ పెద్ద నష్టాన్ని మిగిల్చింది. అప్పట్లో సుమారు లక్ష మంది చనిపోయి ఉంటారని అంచనా. సముద్రంలో 8.5 నుంచి 9.0 తీవ్రతతో భూకంపం రావడంతో సునామీ వచ్చింది. దీంతో 30 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడ్డాయి. ఈ సునామీ లిస్బన్ తో పాటు ఇతర తీర ప్రాంతాలను ముంచెత్తింది. ఇక 1868లో పసిఫిక్ మహా సముద్రంలో 8.5 తీవ్రతో భూకంపం వచ్చింది. దీంతో వచ్చిన సునామీ చిలీ, పెరూ తీరాలపై ప్రభావం చూపింది. అప్పట్లో 25 వేల మంది చనిపోయారని చెబుతారు. 1883 ఇండోనేసియాలో కాక్రటోవా అగ్నిపర్వతం బద్దలైనప్పుడు జావా, సుమత్రా దీవుల్లో సునామీ వచ్చింది. అప్పట్లో 40 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడ్డాయి. దీని వల్ల అప్పట్లో 30 వేలకు పైగా ప్రజలు చనిపోయారని అంచనా. 1896లో జపాన్ లో 8.5 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా సన్ రిక్ ప్రాంతంలో సునామీ వచ్చింది. 1960లో చిలీలో సునామీ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. సుమారు ఆరు వేల మంది చనిపోయారని చెబుతారు. 2004 డిసెంబర్ 26న లో హిందూ మహాసముద్రంలో సునామీ వచ్చింది. ఇండోనేషియా సుమత్రా ద్వీప తీరంలో 9.1 తీవ్రతతో వచ్చిన భూకంపంతో సునామీ వచ్చింది. ఈ సునామీ ప్రపంచంలోని 14 దేశాలపై ప్రభావం చూపింది. ఇండియాలోని తమిళనాడుపై దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది.

పసిఫిక్ మహాసముద్రంలో 2011 , మార్చి 11న జపాన్ లో 9.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో సముద్రపు అడుగుభాగం స్థానభ్రంశం చెంది సునామీకి కారణమైంది. ఇది తూర్పు తీరంలో ఎక్కువ భాగాన్ని నాశనం చేసింది.జపాన్‌లోని ప్రధాన ద్వీపం హోన్షులో 10 మీటర్ల ఎత్తులో అలలు నగరాన్ని తాకాయి . ఇవాటే , ఫుకుషిమా , ఇబారకి, చిబా ప్రిఫెక్చర్‌లలోని తీర ప్రాంతాలు దెబ్బతిన్నాయి. సునామీ కూడాతీరం వెంబడి ఉన్న ఫుకుషిమా దైచి విద్యుత్ కేంద్రంలో పెద్ద అణు ప్రమాదం చోటు చేసుకుంది.